Farmers Protest – Shiv Sena: శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ బోర్డర్‌లో రైతుసంఘం నాయకుడు రాకేశ్ తికాయత్‌ను కలిశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా రైతులు చేస్తున్న ఆందోనకు శివసేన తరఫున ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఘాజీపూర్ బోర్డర్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయిత్‌ను కలిసి మాట్లాడారు. శివసేన పార్టీ, తమ అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సందేశాన్ని ఆయన రైతు నాయకులకు తెలియజేశారు. ఆయన ఆయన వెంట పార్టీ ఎంపీ అరవింద్ సావంత్, పలువురు నాయకులు ఉన్నారు.
అనంతరం మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడారు. పార్టీ సందేశాన్ని తికాయిత్‌కు తెలియజేసి, సంఘీభావం ప్రకటించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం రైతులతో మాట్లాడాలని సూచించారు. అహంకారంతో దేశాన్ని నడపలేమంటూ ఆయన పరోక్షంగా కేంద్రాన్ని విమర్శించారు.
Shiv Sena leaders including party MPs Arvind Sawant and Sanjay Raut meet Bharatiya Kisan Union leader Rakesh Tikait at Ghazipur (Delhi-Uttar Pradesh) border. pic.twitter.com/KC4ZZDhJPG
— ANI (@ANI) February 2, 2021
Also Read:
ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు