UP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన ప్రత్యర్థులు.. పోటీ చేస్తున్న మహిళ చీరను లాగి…

UP Panchayat Elections: ఉత్తరప్రదేశ్‌లో మహిళల పట్ల జరిగే అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ..

UP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన ప్రత్యర్థులు.. పోటీ చేస్తున్న మహిళ చీరను లాగి...
UP Panchayat Elections

Updated on: Jul 09, 2021 | 11:47 AM

UP Panchayat Elections: ఉత్తరప్రదేశ్‌లో మహిళల పట్ల జరిగే అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన మహిళపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఆమె చీర లాగారు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే, లక్ష్మీపూర్ ఖేరి అనే ప్రాంతంలో ఓ మహిళ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమె సమాజ్‌వాది పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయానికి బయలుదేరింది. అయితే, సదరు మహిళ పోటీ చేయడాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన మహిళను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. ఆమె చేతి నుంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ చీరను సైతం లాగేశారు ప్రత్యర్థులు. అయితే, ఈ వివాదాన్ని కొందరు తమ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది.

ఇక మహిళపై దాడి వీడియోను చూసిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూపీ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇది చేసింది కచ్చితంగా బీజేపీ నేతలే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ పైనా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు ఉన్న రక్షణ ఇది అంటూ నిప్పులు చెరిగారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.

Also read:

TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)లో 5 లక్షలు దాటిన ఉద్యోగులు.. దేశంలో అతిపెద్ద ఎంప్లాయర్స్‌

Rajini Kanth: చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తలైవికి ఘన స్వాగతం పలికిన అభిమానులు..

YCP MP Complaint: తెలంగాణ సర్కార్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. చర్యలు తీసుకోండి.. కేంద్రానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు