PM Security Breach: ఆ అద్భుత అవకాశాన్ని మోడీ కోల్పోయారు.. ప్రధాని పంజాబ్‌ పర్యటనపై అఖిలేష్ సెటైర్లు..

|

Jan 08, 2022 | 12:31 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటన, అనంతర పరిణామాలతో రాజకీయ రగడ రాజుకుంటోంది. మోడీ కాన్వాయ్‌ నిలిచిపోవడం, రైతులు నిరసన

PM Security Breach: ఆ అద్భుత అవకాశాన్ని మోడీ కోల్పోయారు.. ప్రధాని పంజాబ్‌ పర్యటనపై అఖిలేష్ సెటైర్లు..
Akhilesh Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటన, అనంతర పరిణామాలతో రాజకీయ రగడ రాజుకుంటోంది. మోడీ కాన్వాయ్‌ నిలిచిపోవడం, రైతులు నిరసన తెలపడంపై బీజేపీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ప్రధాని మోడీ పంజాబ్‌ పర్యటనపై స్పందించారు. నిరసన తెలిపిన రైతులు ఫిరోజ్‌పూర్‌ బహిరంగ సభకు మోడీని వెళ్లనిస్తే బాగుండేదన్నారు. అయితే అన్నదాతలు అడ్డుకోవడంతో సభలో ‘ఖాళీ కుర్చీలు’ చూసే అద్భు్తమైన అవకాశాన్ని మోడీ కోల్పోయారని అఖిలేష్‌ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా గతంలో తాను పాల్గొన్న ఓ బహిరంగ సభకు కేవలం 25 మందే వచ్చారని ఎస్పీ అధినేత గుర్తు చేసుకున్నారు. ‘జార్ఖండ్‌లోని కోడెర్మాలో ఓసారి నాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నేను నిర్వహించిన బహిరంగ సభకు కేవలం 25 మంది మాత్రమే వచ్చారు. దీంతో మా పార్టీ నేతలు నన్ను మాట్లాడనీయకుండా గంటల తరబడి అడ్డుకున్నారు. అయినప్పటికీ 25 మందిని ఉద్దేశించే నేను ప్రసంగించాను. ఇప్పుడు కూడా పంజాబ్‌లో నిరసన చేపట్టిన ప్రజలు, రైతులు కూడా సభావేదిక వద్దకు మోడీని అనుమతించి ఉంటే బాగుండేది. అక్కడ బహిరంగ సభలో ఉన్న ఖాళీ కుర్చీలను చూసి ప్రధాని ఎంతో సంతోషించేవారు. నా మాదిరిగానే ఆయన కూడా ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగించేవారు. కనీసం అప్పుడైనా సాగు చట్టాలను ఎందుకు తెచ్చారో? ఎందుకు రద్దు చేశారో? చెప్పేవారు. బహిరంగ సభ రద్దుతో దేశ ప్రజలకు అది తెలియకుండా పోయింది. అందుకు చాలా బాధగా ఉంది’ అని వ్యంగంగా వ్యాఖ్యానించారు అఖిలేష్‌.

త్వరలో ఉత్తరప్రదేశ్ లో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీకి, ఎస్పీ మధ్య ప్రధానంగా పోటీ ఉండవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని మోడీపై  అఖిలేష్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Also Read:

Anantapur: లైంగిక వేధింపులే ఆ మహిళా కానిస్టేబుల్‌ను బలి తీసుకున్నాయా? సూసైడ్‌ నోట్‌లో వెలుగుచూస్తోన్న వాస్తవాలు..

Jason Roy: తండ్రైన ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌.. కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..