Russia-Ukraine War: ఎటు చూసినా బాంబు పేలుళ్లు, శ్మశానాల్లా మారిపోతున్న నగరాలు, పట్టణాలు.. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని బిక్కు బిక్కుమంటోన్న ప్రజలు.. ఇది ప్రస్తుతం ఉక్రెయిన్ (Ukraine) లో పరిస్థితి. రష్యా జరుపుతున్న సైనిక దాడుల్లో ఆ దేశ ప్రజలే కాదు అక్కడ నివాసముంటోన్న ఇతర దేశాల ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో తక్షణమే రెండు దేశాలు యుద్ధం ఆపేయాలని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఆధునిక యుగంలో కూడా ఇలా రెండు దేశాలు యుద్ధానికి దిగడం సరికాదని శాంతి చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ ‘స్టాప్ వార్’ అంటూ నెటిజన్లు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక సందర్భం ఏదైనా, అంశం ఎటువంటిదైనా.. తన సైకత శిల్పాల ద్వారా ప్రపంచ శాంతి కోరే సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik )యుద్ధం ఆపేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆలోచింపజేసేలా..
ఈ సైకత శిల్పంలో ఓవైపు రష్యా జాతీయ పతాకం దానిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిమ, మరోవైపు ఉక్రెయిన్ జెండా, ఆ దేశ ప్రెసిడెంట్వ్లొదిమిర్ జెలెన్‌స్కీ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల జరగుతున్న వినాశనాన్ని ప్రతిబింబించేలా అగ్ని, ఓ చిన్నారి ప్రతిమలు ఉన్నాయి. దీనిపై ‘స్టాప్ వార్’ అని ఇంగ్లిష్‌లో రాసి ఉంది. ఇదే కాదు ఇటీవల మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రపంచానికి శాంతిని ప్రసాదించాలని కోరుతూ శివుడు, శివలింగం సైకత శిల్పాలు రూపొందించారు సుదర్శన్ పట్నాయక్. ఓం నమ: శివాయ అంటూ ఈ సైకత శిల్పానికి క్యాప్షన్ ఇచ్చారు.
My SandArt at Puri beach with message STOP WAR . #RussianUkrainian pic.twitter.com/Jj9Um8wT4e
— Sudarsan Pattnaik (@sudarsansand) March 4, 2022
Teeth: దంతాల రంగు మారడానికి మీరు చేసే ఈ 5 తప్పులే కారణం.. అవేంటంటే..?