Police Raid: ప్రభుత్వ క్లర్క్‌ ఇంటిపై పోలీసుల దాడులు.. రూ.85 లక్షలు స్వాధీనం..!

|

Aug 04, 2022 | 6:00 AM

Police Raid: మధ్యప్రదేశ్‌లో పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ క్లర్క్‌ నివాసంలో రూ.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదాయానికి..

Police Raid: ప్రభుత్వ క్లర్క్‌ ఇంటిపై పోలీసుల దాడులు.. రూ.85 లక్షలు స్వాధీనం..!
Follow us on

Police Raid: మధ్యప్రదేశ్‌లో పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ క్లర్క్‌ నివాసంలో రూ.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును విచారిస్తున్న మధ్యప్రదేశ్‌ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EoW) అధికారులు నిర్వహించిన దాడిలో ఈ నగదును స్వాధీనం చేసుకుంది. అయితే రాష్ట్ర వైద్ విద్యాశాఖలో క్లర్క్‌గా పని చేస్తున్న కేశ్వాని నివాసానికి అధికారులు చేరుకున్నారు. సోదాలు నిర్వహిస్తున్న తరుణంలో కేశ్వాని అవస్థతకు గురయ్యారు. వెంటనే అయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్లర్క్‌ అనారోగ్య కారణాలతో అధికారులను ఆయనను విచారించలేకపోయారు. నెలకు రూ.4000 జీతంతో ఉద్యోగం ప్రారంభించిన హీరో కేశ్వానికి ప్రస్తుతం రూ.50,000 సంపాదిస్తున్నాడు. భారీగా డబ్బులను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

దాడి సందర్భంగా ఉద్యోగి ఇంటి బయట పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ చర్య తీసుకున్నారు. ఈఓడబ్ల్యూ టీమ్ ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో హీరో కేశ్వాని ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించింది. భోపాల్‌లోని మెడికల్ డిపార్ట్‌మెంట్‌లోని క్లర్క్, ఈఓడబ్ల్యూ జబల్‌పూర్‌లోని మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంటిపై కూడా దాడి చేశారు.

హీరో కేశ్వానిపై చాలా కాలంగా అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులు భారీగా అందుతున్న నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. జబల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అసిస్టెంట్ ఇంజనీర్‌కు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలిందని తెలుస్తోంది. ఇంజనీర్ తన ఉద్యోగ సమయంలో సృష్టించిన ఆస్తి అతని ఆదాయం కంటే 203% ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి