Inter-Caste Marriage: ప్రపంచమంతా అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే.. కొందరు మాత్రం కులం, మతం అంటూ కొట్టుకు చస్తున్నారు. కులం పేరుతో మనుషులను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలోని ఆనందపూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఖాలియామెంట నియలిజరణ గ్రామ పంచాయతీలో వెలుగు చూసింది. కులాంతం వివాహం చేసుకున్నారనే కారణంతో ఓ కుటుంబానికి రూ. 25.60 లక్షల జరిమానా విధించారు గ్రామ పంచాయతీ పెద్దలు. అంతేకాదు.. ఆ కుటంబాన్ని వెలివేశారు.
అధికారిక సమాచారం ప్రకారం.. ఖాలియామెంట గ్రామానికి చెందిన మహేశ్వర్ బాస్కే.. వేరే కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత కొంతకాలం వేరే ప్రాంతంలో జీవనం సాగించాడు. అయితే, ఇటీవల స్వగ్రామానికి రాగా.. కులాంతర వివాహం చేసుకున్నందుకు గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ పెట్టి.. మహేశ్వర్ బాస్కే కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే.. రూ. 25.60 లక్షల జరిమానాను విధించారు.
మహేశ్వర్, అతని భార్య ఇతర ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఎలాంటి సమస్యా రాలేదని, దంపతులు గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాన్ని పూర్తిగా బహిష్కరించారంటూ మహేశ్వర్ తల్లి పూలమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామ పెద్దల తీరుతో షాక్ అయిన బాధితు కుటుంబ సభ్యులు గ్రామాన్ని వీడి వేరే గ్రామంలో ఉన్న తమ బంధువుల వద్ద నివాసం ఉంటున్నారు. అయితే, ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది బాధిత కుటుంబం. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also read:
Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..
Barack Obama Birthday: ఒబామా జేబులో హనుమాన్ ప్రతిమ.. ఆసక్తికర విషయాలు మీకోసం..