రూ.2 వేల నోట్లను బ్యాంకులకు తిరిగి ఇవ్వాలని ఆర్‌బిఐ ప్రజలను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ నోట్లను నిషేధించలేదు. కొంత మంది ఆ డబ్బును బ్యాంకుకు వెళ్లకుండా బంగారం కొనుగోలుకు వినియోగిస్తున్నారు ప్రజలు. బ్యాంకుకు వెళ్లి ఈ సొమ్మును తమ ఖాతాలో జమ చేసేందుకు కూడా కొంత మంది వెనుకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక కస్టమర్ రూ. 5 లక్షలకు పైగా విలువైన బంగారు గాజులు కావాలని కొరుకున్న డిజైన్‌తో బుక్ చేసుకున్నాడు. అందుకు కావాల్సిన డబ్బు మొత్తం రూ.2 వేల నోట్లనే వ్యాపారికి ముట్టజెప్పాడు. మొత్తం నగడు నోట్ల రూపంలో చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. పూర్తి మనీతో గోల్డ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాడు. మరికొద్ది రోజుల్లోనే ఆ బ్యాంగిల్ అతని చేతికి చేరనుంది.
ఇదోక్కటే కాదు..రూ. 2,000 నోట్లను రద్దు చేస్తూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకున్న ఒక రోజు తర్వాత ఆభరణాల వ్యాపారులు రూ.2,000 నోట్లతో బంగారాన్ని కొనుగోలు చేసే కస్టమర్ల తాకిడి చూశారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదంతా బ్లాక్ మనీ అయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. అంతేకాదు..చాలా నగల దుకాణాల్లో ఈ దృశ్యం మామూలేనని కూడా సమాచారం. షాపు సిబ్బంది రూ.2 వేల నోట్ల లెక్కింపుతో బిజిగా ఉన్నారు. యంత్రాల్లోనో, చేతితోనూ విపరీతంగా వస్తున్న నోట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి పింక్ నోట్లు బీభత్సం సృష్టించాయని నోయిడాలోని ప్రముఖ రిటైల్ నగల వ్యాపారి ఒకరు తెలిపారు.
2,000 రూ. నోట్లలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంటే కొందరు ఆభరణాల వ్యాపారులు పసుపు లోహానికి నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే పన్ను కట్టాల్సి వస్తుందని ఇతర మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ తరువాత.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, దేవాలయాలు, మత సంస్థల ద్వారా నగదును మార్పిడి చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అధిక-విలువైన లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ వివరాలు అవసరం కాబట్టి, పన్ను అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఆభరణాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు రూ.2,000 నోట్లను పెద్దమొత్తంలో ఉపయోగించడం కూడా ఒకరకంగా కష్టమైన పనిగానే మారింది.
సెప్టెంబర్ 30, 2023 వరకు బ్యాంకు శాఖల్లో రూ.2,000 నోట్లు చెలామణిలో ఉంటాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. నోట్లను డిపాజిట్ చేయమని లేదా మార్చుకోవాలని ప్రజలకు తెలియజేసారు. అయితే, సెప్టెంబర్ 30 గడువు ముగిసిన తర్వాత కూడా ఈ నోట్లు చట్టబద్ధంగానే కొనసాగుతాయని పేర్కొంది.
పన్ను శాఖ పాన్ డేటాను ఆదాయపు పన్ను రిటర్న్‌లతో సరిపోల్చుతుంది. వారి ఆదాయాన్ని దాచిన వారిని ట్రాక్ చేస్తుంది. బంగారం, ఫర్నీచర్, లగ్జరీ వస్తువులు, ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతుందని, ఇలాంటి ఖర్చుల పట్ల ప్రజలు రూ.2,000 నోట్లను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..