V D Savarkar: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో VD సావర్కర్ వేషధారణలో చిన్నారి.. భగ్గుమన్న యూత్‌ కాంగ్రెస్‌, ముస్లిం లీగ్..

| Edited By: Ravi Kiran

Aug 17, 2022 | 3:44 PM

Child Dressed as V D Savarkar: కేరళలోని మలప్పురం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ విద్యార్థి వినాయక్ దామోదర్ సావర్కర్ వేషధారణలో..

V D Savarkar: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో VD సావర్కర్ వేషధారణలో చిన్నారి.. భగ్గుమన్న యూత్‌ కాంగ్రెస్‌, ముస్లిం లీగ్..
Child Dressed As V D Savark
Follow us on

కర్నాటక తర్వాత కేరళను(Kerala) తాకింది. స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్(V D Savarkar ) మద్దతు దారులకు, వ్యతిరేకలు మధ్య వివాదం రాజుకుంది. కేరళలోని మలప్పురం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ విద్యార్థి వినాయక్ దామోదర్ సావర్కర్ వేషధారణలో హాజరయ్యాడని ఆరోపిస్తూ రచ్చ మొదలు పెట్టారు అక్కడి విద్యార్థి సంఘాలు. అరీకోడ్‌ పరిధిలోని జీవీహెచ్‌ఎస్‌ స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీలో వీడీ సావర్కర్‌ను చేర్చడాన్ని నిరసిస్తూ నిరసన. యూత్‌లీగ్‌, యూత్‌ కాంగ్రెస్‌, ఎస్‌డిపిఐలు నిరసనకు దిగాయి. దీనిపై పాఠశాల ఇన్‌ఛార్జ్ టీచర్‌ని వివరణ కోరినట్లు పాఠశాల అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో నిర్వహించిన ర్యాలీలో వీడీ సావర్కర్‌ను చేర్చుకోవడమే వివాదాలకు కారణం.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), యూత్ కాంగ్రెస్, యూత్ లీగ్ యువజన విభాగం కార్యకర్తలు మంగళవారం కీజుపరంభలోని ప్రభుత్వ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్ వద్ద నిరసనలకు దిగారు. చిన్నారికి వీడీ సావర్కర్‌ వేషం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వార్తా ఛానెల్‌లు ప్రసారం చేసిన కార్యక్రమంలోని ఫోటోలు సావర్కర్‌తో సహా స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ఉన్న పిల్లలను చూపించాయి.

వివాదాస్పద ర్యాలీలో పాల్గొనేందుకు స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరి వేషధారణలో ఉన్న చిన్నారిపై వీడీ సావర్కర్ పేరును రాసి ఉంచిన ఫొటో వైరల్‌గా మారిందిఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రేగింది. గ్రీన్ రూమ్ నుంచి ఫోటో తీసినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే, ఇందులో ఎలాంటి వివాదం లేదని, ఊరేగింపుకు ముందు వీడీ సావర్కర్ నేమ్‌బోర్డ్‌ను తొలగించారు. ఈ వివాదంపై పాఠశాల అధికారులు ఇంకా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం