Road Accident : నెత్తురోడిన రహదారి.. ఆగిఉన్న లారీని ఢీకొన్న మినీ వ్యాన్‌.. ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి

|

Apr 29, 2024 | 12:04 PM

మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు బెమెతరా జిల్లా కలెక్టర్‌ రణ్‌వీర్‌ శర్మ వివరాలు వెల్లడించారు.. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిని మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌కి తరలించామని చెప్పారు. జరిగిన ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నిండింది.

Road Accident : నెత్తురోడిన రహదారి.. ఆగిఉన్న లారీని ఢీకొన్న మినీ వ్యాన్‌.. ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి
Road Accident
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 9 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని కతియా వద్ద ఆగి ఉన్న లారీని ఓ మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. ప్రమాదంలో మరో 23 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వారిని రాయ్‌పూర్ ఎయిమ్స్‌కు తరలించారు. మిగిలిన క్షతగాత్రులు జిల్లా ఆసుపత్రి, బెంతారా, సిమ్గాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2.30 గంటలకు జరిగింది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 50 మంది వరకు ఉన్నట్టుగా తెలిసింది.

సమాచారం ప్రకారం, సిమ్గా సమీపంలోని ఒక గ్రామంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు 40 నుండి 50 మంది వరకు ప్రయాణికులు వ్యాన్‌లో బయల్దేరారు. తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో కథియా సమీపంలో ఆగి ఉన్న లారీని వ్యాన్‌ ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిన బెమెత్రా జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, ఎటు చూసిన నెత్తుటి ప్రవాహంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు బెమెతరా జిల్లా కలెక్టర్‌ రణ్‌వీర్‌ శర్మ వివరాలు వెల్లడించారు.. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిని మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌కి తరలించామని చెప్పారు. జరిగిన ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నిండింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..