Supreme Court Dismisses: ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసన వ్యక్తం చేస్తామంటే కుదరదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రివ్యూ పిటిషన్ కొట్టివేత

నిరసన తెలిపేందుకుగల హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొంది.    2019  ఫిబ్రవరిలో లో  సీఏఏ కి వ్యతిరేకంగా..

Supreme Court Dismisses: ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసన వ్యక్తం చేస్తామంటే కుదరదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రివ్యూ పిటిషన్ కొట్టివేత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 13, 2021 | 11:12 AM

Supreme Court Dismisses: నిరసన తెలిపేందుకుగల హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొంది.    2019  ఫిబ్రవరిలో లో  సీఏఏ కి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద కొన్ని రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన ఆందోళనపై 12 మంది యాక్టివిస్టులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. ప్రొటెస్ట్ చేసే హక్కు ఎప్పుడైనా, ఎక్కడైనా ఉంటుందనలేమని, తరచూ అప్పటికప్పుడు ఆందోళనలు జరుగుతున్న విషయం వాస్తవమేనని, కానీ బహిరంగ కూడళ్లలో అనేక రోజులపాటు ఆందోళనలు జరిగితే అది ఇతరుల హక్కులకు భంగపరచడమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయమూర్తులు ఎస్.కె. కౌల్, అనిరుధబోస్, కృష్ణమురారిలతో కూడిన బెంచ్ ఈ విశిష్టమైన తీర్పునిచ్చింది. ఈ నెల 9 న ఈ రివ్యూ పిటిషన్ పై నిర్ణయం తీసుకున్నప్పటికీ గతరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నెలలతరబడి జరిగే ఆందోళనలను అంగీకరించే ప్రసక్తి లేదని గత ఏడాది అక్టోబరులోనే సుప్రీంకోర్టు పేర్కొంది.

Also Read:

India Corona: కరోనాతో గత 24 గంటల్లో 103 మంది మృతి.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Regional Ring Road: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం