జూనియర్ డాక్టర్ హత్య కేసు.. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సువేందు!

కోల్‌కతాలో తీవ్ర సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ రేప్, హత్య కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా బెంగాల్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జైళ్లలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, ఆర్జీ కర్ ఘటనపై జరుగుతున్న దర్యాప్తుపై సమీక్ష నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు.

జూనియర్ డాక్టర్ హత్య కేసు.. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సువేందు!
Rg Kar Case Updates

Updated on: May 16, 2026 | 10:56 AM

తాజగా బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలు, గత ప్రభుత్వంలో జరిగిన నేరాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం సీఎం సువేందు అధికారి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జైళ్లలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, ఆర్జీ కర్ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే జూనియర్ డాక్టర్ హత్య కేసులో తీవ్ర పరిపాలనా లోపాలు, దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగినట్టు ఆయన తెలుసుకున్నారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి లంచం ఇచ్చేందుకు ప్రతయ్నించారని ఆరోపణలు రావడంతో
ఈ కేసును ఇన్వెస్ట్‌గేషన్ చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సువేందు ఆదేశాలు జారీ చేశారు.

రక్షకులే భక్షకులుగా మారారు: సీఎం సువేందు అధికారి

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రక్షకులే భక్షకులుగా మారే పరిస్థితి వచ్చిందనిన్నారు. పరిపాలనా విభాగంలోని కొన్ని వర్గాలు నేరస్థులతో చేతులు కలిపాయని విమర్శించారు. ఈ దుర్మార్గపు నెట్‌వర్క్‌ను అంతమొందించడానికి ప్రస్తుత ప్రభుత్వం తన నిరంతర చర్యలను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

23 మొబైల్ ఫోన్లు స్వాధీనం

అయితే జైల్లలో ఖైదీలు పెద్ద ఎత్తున స్మార్ట్‌ఫోన్‌లతో సహా మొబైల్ ఫోన్‌లు ఉన్నాయనే ఆరోపణలు జైల్లలో తక్షణ తనిఖీలకు సీఎం సువేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో 10 ప్రత్యేక బృందాలు దాదాపు నాలుగు గంటల పాటు జైల్లలో తనిఖీలు నిర్వహించగా ఖైదీల నుంచి సుమారు 23 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌లు జైలులోకి ఎలా వచ్చాయి, వీటిని ఎవరు వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు సీఐడీ ఇన్వెస్టిగేసన్‌కు ఆదేశించారు సీఎం సువేందు. అలాగే పరిపాలనా నిర్లక్ష్యం వహించిన జైలు సూపరింటెండెంట్ ఎన్. కుజూర్, చీఫ్ కంట్రోలర్ దీప్త ఘోరాయ్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us