AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్ రిపేర్ వచ్చిందని ఎలక్ట్రీషియన్ వద్దకు.. అతను విప్పి చూడగా షాక్..

మదరసాకు విరాళంగా వచ్చిన ఫ్యాన్‌ను రిపేర్ కోసం తీసుకెళ్లగా, దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉండటం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్‌లో జరిగిన ఈ ఘటనతో మౌల్వీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్యాన్ అందిందని, విచారణ జరుగుతోందని మదరసా ప్రతినిధులు తెలిపారు.

ఫ్యాన్ రిపేర్ వచ్చిందని ఎలక్ట్రీషియన్ వద్దకు.. అతను విప్పి చూడగా షాక్..
Made In Pakistan Fan
Ram Naramaneni
|

Updated on: May 16, 2026 | 10:51 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్‌లో చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భావించే ఓ ఫ్యాన్ కారణంగా మదరసాకు చెందిన మౌల్వీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. కుశినగర్‌లోని హకీకతుం ఉలూం మదరసాలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ చెడిపోవటంతో దానిని రిపేర్ చేయించడానికి ఓ ఎలక్ట్రీషియన్ వద్దకు తీసుకెళ్లారు. ఫ్యాన్‌ను విప్పి పరిశీలించిన ఎలక్ట్రీషియన్ దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కంగారుపడిన మదరసా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఫ్యాన్ తమకు రెండేళ్ల కిందట విరాళంగా అందిందని, రాజ్ మిస్త్రీ కంపెనీలో పనిచేసే షంషుద్దీన్ దీన్ని బహుమతిగా ఇచ్చారని మౌల్వీ వివరించారు. సౌదీలో ఉండే షంషుద్దీన్ కుమారుడు దీన్ని కార్గో ద్వారా పంపించారని వెల్లడించారు. మేడ్ ఇన్ పాకిస్తాన్ మార్కుతో ఉన్న వస్తువు తమ వద్ద ఉండటం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయోనని ఆందోళన చెందామని మదరసా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. పూర్తి సాక్ష్యాధారాలు లభ్యం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
రిపేర్ వచ్చిన ఫ్యాన్‌ను విప్పి చూసి షాకైన ఎలక్ట్రీషియన్
రిపేర్ వచ్చిన ఫ్యాన్‌ను విప్పి చూసి షాకైన ఎలక్ట్రీషియన్
అటుకుల పాయసం.. పళ్ళులేని ముసలివాళ్ళు కూడా తినే అంత మెత్తగా..
అటుకుల పాయసం.. పళ్ళులేని ముసలివాళ్ళు కూడా తినే అంత మెత్తగా..
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే..
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే..
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!