బీహార్ డీజీపీ రాజీనామా, ఇక రాజకీయ రంగ ప్రవేశం !
బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే రాజీనామా చేశారు. ఇక తాను రాజకీయాల్లో అడుగుపెడతానని ప్రకటించారు. సుశాంత్ సింగ్ కేసుకు, తన నిర్ణయానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. (సుశాంత్ కేసులో మొదట సుశాంత్ తండ్రి కేకే ఖాన్ ..
బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే రాజీనామా చేశారు. ఇక తాను రాజకీయాల్లో అడుగుపెడతానని ప్రకటించారు. సుశాంత్ సింగ్ కేసుకు, తన నిర్ణయానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. (సుశాంత్ కేసులో మొదట సుశాంత్ తండ్రి కేకే ఖాన్ ..రియా చక్రవర్తిపై ఆరోపణలు చేస్తూ ఈ మాజీ డీజీపీకే ఫిర్యాదు చేశారు).కాగా-ఆ కేసు గురించి ఇక తాను పట్టించుకోవలసిన అవసరం లేదని గుప్తేశ్వర్ పాండే సూచనప్రాయంగా చెప్పారు. రాజీనామా చేశాను గనుక ఇక తనకు ప్రభుత్వ నిబంధనలు వర్తించబోవన్నారు. తను బక్సర్ జిల్లా సాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఈ జిల్లా నుంచి పలువురు స్థానికులు రోజూ తనను కలుస్తున్నారని, తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఏ పార్టీ నంచి ఖఛ్చితంగా పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఏమైనా తన రిటైర్మెంట్ కు సుశాంత్ కేసుకు ఏ మాత్రం సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు.