Republic Day 2026 Live: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఢిల్లీలో హై అలర్ట్

77th Republic Day Parade Live Updates in Telugu: 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ, వైమానిక దళం, నావికాదళం, సాంస్కృతిక శకటాలు, వివిధ ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ కవాతు , వేడుక జరుగుతుంది. కవాతు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Republic Day 2026 Live: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఢిల్లీలో హై అలర్ట్
77th Republic Day Parad

Updated on: Jan 26, 2026 | 9:46 AM

LIVE NEWS & UPDATES

  • 26 Jan 2026 09:46 AM (IST)

    రాజ్యాంగాన్ని రక్షించడం అంటే భారత గణతంత్రాన్ని రక్షించడమే – రాహుల్ గాంధీ

    లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయన ఇలా రాశారు. “గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా దేశస్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన రాజ్యాంగం ప్రతి భారతీయుడి గొప్ప ఆయుధం. అది మన గొంతు, మన హక్కుల కవచం అని అన్నారు.

     

  • 26 Jan 2026 09:16 AM (IST)

    పరేడ్‌ గ్రౌండ్‌ లో

    దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


  • 26 Jan 2026 09:01 AM (IST)

    తెలుగు రాష్ట్రాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

    తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో గవర్నర్‌ జెండాను ఆవిష్కరించారు. అటు ఏపీలో కూడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

  • 26 Jan 2026 08:49 AM (IST)

    బీజేపీ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

    ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు నితిన్ నవీన్ జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి, అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.

  • 26 Jan 2026 08:12 AM (IST)

    స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి లేదు, ఐక్యతే బలం: మోదీ

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియోను షేర్ చేశారు. స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం మన స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు శక్తివంతమైన చిహ్నం అని ఆయన అన్నారు. ఈ పండుగ మనకు కొత్త శక్తిని, దేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఐక్యంగా ముందుకు సాగడానికి ప్రేరణను ఇస్తుంది. ఆయన ఒక శ్లోకాన్ని కూడా పంచుకున్నారు.

     


  • 26 Jan 2026 08:08 AM (IST)

    ముఖ్యమంత్రి నివాసంలో జెండా

    రాజస్థాన్: ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రి నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ జైపూర్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

     

  • 26 Jan 2026 07:50 AM (IST)

    అవార్డులు

    గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది . ఈ సంవత్సరం, వివిధ రంగాలలో అత్యుత్తమ కృషి చేసినందుకు దేశవ్యాప్తంగా 131 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో ఐదుగురు పద్మ విభూషణ్, 13 మంది పద్మ భూషణ్, మరియు 113 మంది పద్మశ్రీలు ఉన్నారు.

  • 26 Jan 2026 07:36 AM (IST)

    ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు

    దేశవ్యాప్తంగా నేడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్య పథంలో జరిగే కవాతుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

     

  • 26 Jan 2026 07:33 AM (IST)

    నా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దేశ ప్రజలకు హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. “నా తోటి పౌరులందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ గర్వం, గౌరవం, కీర్తికి ప్రతీక అయిన ఈ గొప్ప జాతీయ పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలి. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మీ సంకల్పం మరింత బలపడాలి అంటూ ట్వీట్‌ చేశారు.

     

  • 26 Jan 2026 06:54 AM (IST)

    ఎర్రకోట ప్రాంగణంలో వేడుకలు

    గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం జనవరి 26 (నేడు) నుండి ఎర్రకోట ప్రాంగణంలో ఆరు రోజుల జాతీయ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవం అయిన భారత్ పర్వ్‌ను నిర్వహించనుంది. దీనిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభిస్తారని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.

77th Republic Day Parade Live Updates in Telugu: 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ, వైమానిక దళం, నావికాదళం, సాంస్కృతిక శకటాలు, వివిధ ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ కవాతు , వేడుక జరుగుతుంది. కవాతు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం జనవరి 26 (నేడు) నుండి ఎర్రకోట ప్రాంగణంలో ఆరు రోజుల జాతీయ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవం అయిన భారత్ పర్వ్‌ను నిర్వహించనుంది. దీనిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభిస్తారని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ పర్వ్ అనేది మంత్రిత్వ శాఖ ప్రధాన వార్షిక కార్యక్రమం. ఇది భారతదేశం గొప్ప సాంస్కృతిక, కళాత్మక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకుంటుంది.

అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్పం మరింత బలపడాలి: ప్రధాని మోదీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కూడా పోస్ట్ చేశారు. “గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా తోటి పౌరులందరికీ అనేకానేక అభినందనలు. భారతదేశ గర్వం మరియు కీర్తికి ప్రతీక అయిన ఈ జాతీయ పండుగ మీ అందరిలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్పం మరింత బలపడాలి” అని ఆయన కోరారు.