Republic Day-2026: ఈసారి అద్వితీయంగా రిపబ్లిక్‌ వేడుకలు.. సైనిక పరేడ్ కాదు.. ప్రత్యక్ష యుద్ధ రంగం!

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబవుతోంది. ఈసారి కర్తవ్య పథ్ కేవలం పరేడ్ గ్రౌండ్‌లా కాకుండా, భీకర సమరక్షేత్రంలా ముస్తాబవుతోంది! రణక్షేత్రంలో అమలు చేసే లైవ్ యాక్షన్ వ్యూహాలతో భారత సైన్యం తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపబోతోంది.

Republic Day-2026: ఈసారి అద్వితీయంగా రిపబ్లిక్‌ వేడుకలు.. సైనిక పరేడ్ కాదు.. ప్రత్యక్ష యుద్ధ రంగం!
Republic Day 2026

Updated on: Jan 23, 2026 | 2:36 PM

రిపబ్లిక్‌ డే రంగస్థలంపై ఉరకలు వేయడానికి శకటాలు సన్నద్ధమవుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటం నుంచి ఆత్మ నిర్భర్‌ భారత్‌ దాకా, భారత్‌ వేసిన అడుగులు, ఇప్పుడు విశ్వగురువుగా ఎదుగుతున్న గుర్తులను కళ్లకు కట్టనున్నాయి. కళాకారులు తమ రిహార్సల్స్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. వందేమాతరం మెయిన్‌ థీమ్‌గా శకటాల ప్రదర్శన సాగనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు.. దేశం సాధించిన ఆర్థికాభివృద్ధి, అత్యాధునిక టెక్నాలజీని ప్రదర్శించనున్నాయి. వికసిత్‌ భారత్‌ రూపాలను కళాకారులు ఆవిష్కరించనున్నారు. కర్తవ్యపథ్‌లో ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ జరుగుతున్నాయి.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబవుతోంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ కేవలం సంప్రదాయ కవాతులా కాకుండా, అసలైన యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా సాగనుంది. యుద్ధ క్షేత్ర వ్యూహాలను పరేడ్‌లో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించనున్నారు. పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’తర్వాత నిర్వహిస్తున్న మొదటి రిపబ్లిక్‌ డే వేడుకలు కావడంతో ఈసారి కర్తవ్య పథ్‌పై భారత సైన్యం నిజమైన యుద్ధరంగ దృశ్యాన్ని ప్రతిబింబించేలా విన్యాసాల కోసం సైన్యం కసరత్తు చేస్తోంది. నిఘా వ్యవస్థల నుంచి మెరుపు దాడుల వరకు ప్రతి ఘట్టాన్ని ప్రత్యక్ష యుద్ధ దృశ్యంలా ఆవిష్కరించడం ఈ పరేడ్ ప్రత్యేకత. ఈ ఏడాది న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో జరిగే గ్రాండ్ రిపబ్లిక్ డే పరేడ్ కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఈ చారిత్రాత్మక కార్యక్రమం భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక పురోగతి, దేశభక్తి స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. మీరు ఏ కారణం చేతనైనా కవాతును స్వయంగా వీక్షించలేకపోతే, నిరుత్సాహపడకండి. జనవరి 26, 2026న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే TV9 తెలుగులో మీరు పరేడ్‌లోని ప్రతి శకటాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. జనవరి 26 ఉదయం జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను చూడటానికి మీరు వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ సౌలభ్యం కోసం, జనవరి 26న పరేడ్ ప్రారంభమైన తర్వాత మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని సులభంగా వీక్షించగలిగేలా TV9 తెలుగు YouTube లింక్‌ను పొందుపరుస్తున్నాము. YouTubeతో పాటు, TV9 తెలుగు ప్రత్యక్ష ప్రసార టీవీకి లింక్‌ను కూడా అందిస్తున్నాము. కాబట్టి మీరు ఏ మాధ్యమం ద్వారానైనా ఇంటి నుండి గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను ఆస్వాదించండి..

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత సాయుధ దళాలు సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఆకట్టుకునే మార్చ్ పాస్ట్‌ నిర్వహించనుంది ఇవి క్రమశిక్షణ, జాతీయ గర్వాన్ని ప్రదర్శిస్తాయి. కవాతు సమయంలో, మీరు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించే శకటాలను కూడా చూడగలరు. ఈ శకటాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ కళలు, అభివృద్ధి విజయాలను ప్రదర్శిస్తాయి. ఇది దేశ వైవిధ్యాన్ని మీకు తెలియజేస్తుంది. పాఠశాల పిల్లలు, ఎన్‌సిసి క్యాడెట్‌లు, జానపద కళాకారులు, సాంస్కృతిక ప్రదర్శకులు కూడా కవాతులో పాల్గొంటారు. వేడుకలకు శక్తిని, పండుగ శోభను తీసుకొస్తారు. జాతీయ నాయకులు, విదేశీ ప్రముఖులు, విశిష్ట అతిథులు హాజరయ్యే ఈ కార్యక్రమం భారతదేశ ప్రతిష్టతను, పెరుగుతున్న ప్రపంచ స్థాయిని ప్రతిబింబిస్తుంది.

77వ రిపబ్లిక్‌ డే పరేడ్‌కు.. ఢిల్లీ రాష్ట్రీయ రంగస్థల క్యాంప్‌ దగ్గర పూర్తి స్థాయిలో రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు సమాయత్తమయ్యాయి. 2వేల 500 మంది కళాకారులు, ఈసారి కర్తవ్యపథ్‌ మీద, తమ రాష్ట్రాల సంస్కృతిని ఆటపాటల రూపంలో వినిపించనున్నారు. ఈసారి 90 నిమిషాల పాటు కర్తవ్యపథ్‌లో శకటాల ప్రదర్శన జరగనుంది. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతరం గీతమే…మెయిన్‌ థీమ్‌గా ఈవెంట్‌ సాగనుంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం.. స్వాతంత్ర్య సంగ్రామంలో.. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. మర ఫిరంగిలో దట్టించిన మందుగుండు పేలినట్లు. .వందేమాతరం నినాదం దేశమంతా ప్రతిధ్వనించింది. తెల్లవాడి గుండెల్లో గుబులు పుట్టించింది. స్వాతంత్ర్యం కావాలంటూ అఖండ భారతం పెట్టిన పొలికేక.. వందేమాతరం. పశ్చిమ బెంగాల్‌ శకటం.. వందేమాతరం థీమ్‌ను ప్రజల కళ్లకు కట్టనుంది.

అయితే ఈసారి రోస్టర్‌ విధానం వల్ల రిపబ్లిక్ డే పరేడ్ లో తెలుగు రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఇక అసోం, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాల శకటాలు…మధ్య భారత రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు.. తమ తమ శకటాలను ప్రదర్శించనున్నాయి. కర్తవ్యపథ్‌ మీద, శకటాల రూపంలో తమ సంస్కృతి సంప్రదాయాల సంతకం చేయనున్నాయి. శాస్త్ర సాంకేతిక సామాజిక న్యాయ ఆర్థిక రంగాల్లో వికసించిన భారతాన్ని శకటాల రూపంలో ప్రదర్శించనున్నారు. 2047నాటికి వికసిత్‌ భారత్‌ ఎలా ఉంటుందో, ఈ ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టనున్నారు. భారతీయ న్యాయ సంహిత శకటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. అలాగే గాంధీజీ పుట్టిన గుజరాత్‌లో స్వాతంత్ర్య సంగ్రామం ఎలా జరిగిందో శకటాల రూపంలో వివరిస్తారు. ఇక ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత జరుగుతున్న తొలి రిపబ్లిక్ డే పరేడ్‌ కావడంతో, భారత సైనిక పాటవాన్ని, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చూపించనున్నాయి మన రక్షణ బలగాలు. డోంట్ మిస్..!

TV9 తెలుగు లైవ్ టీవీ: లింక్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..