Republic Day 2023: దేశమంతటా రిపబ్లిక్ డే జనవరి 26న.. అక్కడ 29న.. ఎందుకో తెల్సా..?

|

Jan 23, 2023 | 1:24 PM

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని ప్రముఖ దేవాలయంలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 29వ తేదీన జరుపుకోనున్నారు. గణేశుడి ఆలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రతి సంవత్సరం వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. ఇలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది.

Republic Day 2023: దేశమంతటా రిపబ్లిక్ డే జనవరి 26న.. అక్కడ 29న.. ఎందుకో తెల్సా..?
Republic Day In Ganesh Temp
Follow us on

మన దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత.. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది మాత్రం 1950 జనవరి 26.  మన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 26వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో ఒక్క ప్రాంతాల్లో మాత్రం రిపబ్లిక్ డే వేడుకలను జనవరి 26న కాకుండా తిధుల ప్రకారం జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ రిపబ్లిక్ డే వేడుకలను జనవరి 29వ తేదీన జరుపుకోనున్నారు. ఇలా చేయడం వెనుక ప్రత్యేక కారణం ఏమిటి..? ఆ ప్రాంతం ప్రత్యేక ఏమిటి..? ఎక్కడ ఈ విధంగా రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటారో తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని ప్రముఖ దేవాలయంలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 29వ తేదీన జరుపుకోనున్నారు. గణేశుడి ఆలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రతి సంవత్సరం వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. ఇలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ   ఆలయంలో జరుపుకునే వేడుకలను హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. జాతీయ పండగలను కూడా హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుతారు.

తీజ్, హిందూ పండుగలు, వార్షికోత్సవాలను ఇంగ్లీషు తేదీ ప్రకారం జరుపుకునే సంప్రదాయం హిందూ గ్రంథాల్లో లేదని.. పంచాంగం ప్రకారం జరుపుకోవాలని ఆలయ పూజారులు చెబుతున్నారు.  ఏళ్ల తరబడి ఆలయంలో ఇదే జరుగుతోంది. దీంతో భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950న.. అప్పుడు మాఘమాస శుక్ల పక్ష అష్టమి తిథి. కనుక పంచాంగం ప్రకారం.. మాఘమాసంలో ఈ తిథి ఎప్పుడు వస్తే.. ఆరోజునే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ తిధి జనవరి 29న వచ్చింది. కనుక ఈ తేదీన ఉజ్జయిని పెద్ద గణేష్ ఆలయంలో గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. దేశం ఆనందం, శ్రేయస్సు ని కాంక్షిస్తూ.. విఘ్నలకు అధిపతి గణేష్ కి పూజలను చేస్తారు. ఈ రోజున ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగురవేస్తామని, స్వాతంత్య్ర సమరయోధులను కూడా స్మరించుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఉజ్జయిని పెద్ద గణేష్ దేవాలయం 1908లో స్థాపించబడింది. ఆ రోజు మాఘ కృష్ణ పక్ష చతుర్థి తిథి. పండిట్ బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాల ప్రచారం నుండి ప్రేరణ పొందిన పండి. నారాయణ్ వ్యాస్ ఈ ఆలయానికి పునాది వేశారు. ఈ దేవాలయం అప్పట్లో  స్వాతంత్ర సమరయోధుల ఆశ్రయంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ స్వాతంత్య్రం కోసం ఇక్కడ అఖండ యాగాన్ని కూడా నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..