Republic Day 2022: ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఊహాత్మకంగా అడుగు.. మధ్య ఆసియా ఐదు దేశాలకు ఆహ్వానం..

|

Dec 13, 2021 | 8:05 AM

Republic Day 2022:  భారత దేశం ఘనంగా జరుపుకునే గణతంత్రదినోత్సవ వేడుకలకు ప్రతి ఏడాది ఏదొక దేశ అధ్యక్షుడిని అతిధిగా పిలుస్తారు. ఈ సంప్రదాయం ఆనవాయితీగా..

Republic Day 2022: ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఊహాత్మకంగా అడుగు.. మధ్య ఆసియా ఐదు దేశాలకు ఆహ్వానం..
Republic Day 2020
Follow us on

Republic Day 2022:  భారత దేశం ఘనంగా జరుపుకునే గణతంత్రదినోత్సవ వేడుకలకు ప్రతి ఏడాది ఏదొక దేశ అధ్యక్షుడిని అతిధిగా పిలుస్తారు. ఈ సంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది.  ఈ నేపథ్యంలో 2022 ఏడాది లోని గణతంత్ర దినోత్సవం వేడుకలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రిపబ్లిక్ వేడుకలు ఇంకా నెల రోజులు ఉండగా షెడ్యూల్ ఖరారు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆఫ్ఘన్ లో ఉగ్ర ప్రభుత్వం ఏర్పడటంతో మన దేశం మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ఐదు ఆసియా దేశాలకు భారతదేశ ఆహ్వానం పంపింది. న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ హాజరు కావాల్సిందిగా ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్ , తజికిస్థాన్ దేశాధినేతలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ఇదే విషయంపై అధికారులు స్పందిస్తూ.. “దేశాధినేతలకు అధికారిక ఆహ్వానాలు పంపించామని.. వారి నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పారు.

2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. PM నరేంద్ర మోడీ 2015లో మొత్తం ఐదు మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. 2022 రిపబ్లిక్ డే ఈవెంట్‌కు సెంట్రల్ ఆసియా నాయకులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించాలనే నిర్ణయం భారతదేశ మధ్య ఆసియా విధానానికి చాలా అనుగుణంగా ఉంది. ఐదు మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్ మరియు తజికిస్తాన్‌లతో భారతదేశం సాంస్కృతిక, ఆర్థిక మరియు దౌత్య సంబంధాలను పంచుకుంటుందని న్యూఢిల్లీ ఎప్పుడూ చెబుతోంది. ఇరాన్‌లో భారతదేశం నిర్మిస్తున్న చబహార్ పోర్ట్ ద్వారా ఈ ఐదు దేశాలకు మెరుగైన కనెక్టివిటీని ఉంటుందని భారతదేశం సూచించింది.

అయితే ఓ వైపు చైనా ఆగడాలకు చెక్ పెట్టడానికి.. మరోవైపు ఆఫ్గనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఈ మధ్య ఆసియా దేశాల సాన్నిత్యం అవసరమని మనదేశం అధికారులు చెబుతున్నారు. ఇలా 2022 రిపబ్లిక్ డే వేడుకలకు ఈ దేశాలకు ఆహ్వానంపంపించడం ద్వారా అన్ని దేశాలతో మైత్రి సంబంధాలు పెంచుకునే అవకాశం ఏర్పడింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ దేశాల అధినేతలను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానాలను అనేక దేశాలు అందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రెంచ్ అధ్యక్షుడు ప్రాంకోయిస్, అరబ్ దేశాల నుంచి మహమ్మద్ బీన్ జాయేద్,   దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాను,  బ్రెజిల్ నుంచి జైర్ బోల్సనారో వంటి అనేక దేశాల అధ్యక్షులు ముఖ్య అథిదులుగా విచ్చేశారు. అయితే కరోనా కరణంగా 2021 లో రావాల్సిన బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ కు ఆహ్వానం పంపించారు.  జాన్సన్ వేడుకలను రావడానికి అంకరించినప్పటికీ, UKలో COVID-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే తాజాగా 2020 రిపబ్లిక్ డే వేడుకలకు ఏకంగా ఐదు ఆసియా దేశాలకు ఆహ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం. ఈ దేశాల దేశాధినేతలు భారతదేశ గణతంత్ర దినోత్సవం 2022 వేడుకల్లో పాల్గొనడాన్ని అంగీకరించారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read:   నేడు ఈ రాశిలో వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు.. ఈరోజు రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..