Reorganisation Act: విభజన చట్టంలోని ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాము.. లోక్‌సభలో మంత్రి రాతపూర్వకంగా సమాధానం..!

|

Nov 30, 2021 | 12:27 PM

AP Reorganisation Act: విభజన చట్టంలో ఇచ్చిన అనేక హామీలను ఇప్పటికే చాలావరకు నెరవేర్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. విభజన చట్టం..

Reorganisation Act: విభజన చట్టంలోని ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాము.. లోక్‌సభలో మంత్రి రాతపూర్వకంగా సమాధానం..!
Follow us on

AP Reorganisation Act: విభజన చట్టంలో ఇచ్చిన అనేక హామీలను ఇప్పటికే చాలావరకు నెరవేర్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. విభజన చట్టం అమలు, తీసుకున్న చర్యలు, పెండింగ్ అంశాలు, పరిష్కారంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

మరికొన్ని అంశాలు, హామీలు వివిధ దశల్లో అమలవుతున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యా సంస్థల ఏర్పాటు నిర్ణీత సమయంలో పూర్తవుతాయని, విభజన చట్టం ప్రకారం ఆయా సంస్థల ఏర్పాటుకు గరిష్టంగా 10 ఏళ్ళ సమయం ఉందన్నారు.

చట్టంలో పేరొన్న అంశాల అమలు, పురోగతిపై సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో హోం శాఖ ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతోందని అన్నారు. ఇప్పటివరకు 25 సమీక్షలు నిర్వహించామని, రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో అపరిష్కృతంగా ఉన్న అంశాలను ఇరు రాష్ట్రాలు పరస్పర ఆమోదయోగ్యంగా పరిష్కరించుకునేందుకు, ఏకాభిప్రాయం సాధించేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక హోదా అంశం ఉనికిలో లేపప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం అందించేందుకు అంగీకరించింది.

అంగీకరించిన ప్రకారం 2015-16 నుంచి 2019-20 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయం అందుకుంది. అదే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర, రాష్ట్రాల వాటా 90:10 శాతంగా ఉంది. 2015-16 నుంచి 2019-2020 వరకు ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాలు, మరియు వడ్డీల కింద ప్రత్యేక సాయం అందించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

EPF Customers Alert: ఖాతాదారులు అలర్ట్‌.. నేటితో గడువు ముగింపు.. ఆధార్‌ లింక్‌ చేయకపోతే డబ్బులు నిలిచిపోతాయి..!

Post Office scheme: అద్భుతమైన స్కీమ్‌.. రూ.1000 పెట్టుబడితో ప్రారంభించి రూ.14 లక్షలు వరకు సంపాదించుకోండి