Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం.. చంద్రబాబు, పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ..

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు.

Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం.. చంద్రబాబు, పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ..
Delhi Cm Rekha Gupta
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 20, 2025 | 1:38 PM

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా.. హిందీలో ప్రమాణం చేశారు. సీఎంతోపాటు.. ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు.

రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తోపాటు.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు డిప్యూటీ సీఎంల హాజరయ్యారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.. ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు..

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుంటే ఏకంగా 48 చోట్ల BJP అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అద్భుతమైన విజయం తర్వాత ఢిల్లీ CMగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై చాలా చర్చలే జరిగాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వస్తే నిన్న రాత్రి వరకూ CM ఎవరనే సస్పెన్స్‌ కొనసాగింది. చివరికి తొలిసారి MLAగా గెలిచినా రేఖా గుప్తా వైపే BJP అధిష్టానం మొగ్గుచూపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..