AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father Death: రూ.50 ఇవ్వలేదనే కోపంతో తండ్రిని హత్య చేసిన కొడుకు.. దాడిలో తల్లికి గాయాలు.. నిందితుడి కోసం గాలింపు

Father Death: దేశ రాజధాని ఢిల్లీలో నేరాలకు అంతే లేకుండా పోతోంది. నేరాలను అదుపులో ఉంచేందుకు పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. రూ...

Father Death: రూ.50 ఇవ్వలేదనే కోపంతో తండ్రిని హత్య చేసిన కొడుకు.. దాడిలో తల్లికి గాయాలు.. నిందితుడి కోసం గాలింపు
Subhash Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 18, 2021 | 8:22 AM

Share

Father Death: దేశ రాజధాని ఢిల్లీలో నేరాలకు అంతే లేకుండా పోతోంది. నేరాలను అదుపులో ఉంచేందుకు పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. రూ.50 ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని భరత్‌ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిరుద్యోగి కొడుకు అనిల్‌ ప్రతి నిత్యం డబ్బులు కావాలని 70 ఏళ్లు ఉన్న తన తండ్రి మహేంద్రపాల్‌పై ఒత్తిడి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలో రూ.50 ఇవ్వాలని తండ్రిని అడుగగా, ఆయన ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన కొడుకు తండ్రి ఛాతీపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. తరచూ డబ్బులు అడుగుతుండటంతో ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని తండ్రి చెబుతుండటంతో ఆవేశంతో ఆయనపై దాడికి దిగినట్లు అనిల్‌ తల్లి తెలిపింది. కొడుకును వారించేందుకు ప్రయత్నించినా.. తనపై కూడా దాడి చేయడంతో స్వల్పంగా గాయపడి బయటపడినట్లు ఆమె తెలిపింది.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనిల్‌ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇలా కొందరు పనిపాటా లేకుండా తిరుగుతూ తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధిస్తు్న్నారు. తీరా డబ్బులు ఇవ్వకపోతే వారిపైనే దాడి చేసి హతమారుస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కనిపెంచిన తల్లిదండ్రులపైనే కన్నకొడుకులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటం సమాజం ఎటువైపు వెళ్తుందో ఇట్టే అర్థమైపోతోంది. అయితే రాజకీయాలకైనా కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్న ఢిల్లీలో విస్తీర్ణం తక్కువగా ఉండటంతో జనసాంద్రత అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ నేరాలకైనా, రాజకీయాలకైనా కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. తరచూ కిడ్నాప్‌లు, మార్డర్లు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయినా.. ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు.

ఇవీ చదవండి: మావోయిస్టుల ఘాతుకం… రోడ్డు నిర్మాణ పనుల్లో సూపర్‌ వైజర్‌ను కొట్టి చంపేసిన మావోలు.. వాహనాలకు నిప్పు

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. మెట్రో ట్రేడింగ్‌ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో భారీగా మంటలు

Covid-19 Hospital: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం… నలుగురు కరోనా రోగులు సజీవదహనం