Fire Accident: ఎలుక చేసిన పనికి నెత్తి పట్టుకున్న వ్యాపారి.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..
Fire Accident: ఎలుక చేసిన పనికి వ్యాపారి నెత్తి పట్టుకోవాల్సిన పని వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇళ్లుకూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన...
Fire Accident: ఎలుక చేసిన పనికి వ్యాపారి నెత్తి పట్టుకోవాల్సిన పని వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇళ్లుకూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన గుజరాత్‌లోని ఏఎమ్‌టిఎస్ బస్ స్టేషన్ వెనుక కర్మభూమి సోసైటీలో బుధవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన వినోద్ భాయ్ అనే వ్యాపార వేత్త చైత్ర నవరాత్రలు సందర్భంగా ఇంట్లో పూజ నిర్వహించాడు. ఈ సందర్భంగా దీపం వెలిగించి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఇదే సమయంలో అటుగా వచ్చిన ఎలుక దీపాన్ని ఈడ్చుకెళ్లి అక్కడే ఉన్న దుస్తులపై పడేసింది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగిసిపడడంతో ఇళ్లు మొత్తం మంటల్లో కాలిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు రూ. 2 లక్షల నగదు కూడా అగ్నికి ఆహుతైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరకున్న అగ్ని మాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మొదట స్థానికులు నీటి మోటార్ సహాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అగ్నిమాపక సింబంధికి సమాచారం అందించారు.
Also Read: Hyderabad: భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్న ఐటీ ఉద్యోగులు.. వేటు వేసిన కంపెనీలు.. దర్యాప్తులో సంచలనాలుచారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..