Ramdev Baba : అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా.. మండిపడుతున్న వైద్య సంఘాలు..

Ramdev Baba coments : కరోనా చికిత్సలో భాగంగా అల్లోపతి వైద్యంపై బాబా రామ్‌దేవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు భారత

Ramdev Baba : అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా.. మండిపడుతున్న వైద్య సంఘాలు..
Ramdev Baba Coments

Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 9:50 PM

Ramdev Baba coments : కరోనా చికిత్సలో భాగంగా అల్లోపతి వైద్యంపై బాబా రామ్‌దేవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు భారత వైద్య సంఘం (ఐఎంఎ), అనేక ఇతర డాక్టర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. “అల్లోపతి ఒక కుంటి శాస్త్రం.. మొదట, హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది. ఇప్పుడు రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, ప్లాస్మా థెరపీ విఫలమయ్యాయి. ఫాబిఫ్లు, స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటీబయాటిక్స్ కూడా విఫలమయ్యాయి ” అని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. ఆక్సిజన్ కొరత కంటే అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది COVID-19 రోగులు మరణించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలను వైద్య సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన 1200 మందికి పైగా వైద్యుల త్యాగాన్ని అవహేలన చేస్తున్నారని IMA యూనిట్ మండిపడుతోంది. స్వయం ప్రకటిత వ్యాపారవేత్తలు ద్వేషాన్ని, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. కీలకమైన వైద్యుడు ఒకరు మాట్లాడుతూ.. రోగి సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే అతడికి లీగల్ నోటీసులు అందిస్తామని, అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తామని అసోసియేషన్ ప్రకటించింది.

న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, వర్ధ్మాన్ మహావీర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నీచమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అలోపతి దాని అభ్యాసకులను కించపరిచేలా అతడి మాటలు ఉన్నాయని అన్నారు. కరోనా టైంలో ఎంతో మంది వైద్య సేవకుల మనో ధైర్యాన్ని దెబ్బతీసేవిధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. రామ్ దేవ్ బాబా ప్రకటనను ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించాలని అసోసియేషన్ కోరింది.

మధ్యప్రదేశ్ లో కోవిడ్ -19 తో నెలలో లక్ష మంది మృతి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ వెల్లడి, బీజేపీ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపణ

Top10 Plants : ఈ పది మొక్కలు మంచి ఆక్సిజన్ అందిస్తాయి..! వ్యాధులను దూరం చేస్తాయి.. ఏంటో తెలుసుకోండి..

Sushmita Sen: ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ కు కనీసం పోటీనివ్వలేకపోయిన మాజీ విశ్వసుందరి..