మందిర నిర్మాణంపై కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరగబోతుందన్న విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్, ఆర్‌ఎస్ఎస్ చీఫ్, యూపీ గవర్నర్‌తో..

ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరగబోతుందన్న విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్, ఆర్‌ఎస్ఎస్ చీఫ్, యూపీ గవర్నర్‌తో పాటుగా మొత్తం 200 మంది వరకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. అయితే ఈ మందిర నిర్మాణ భూమి పూజపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతిఒక్కరి ఇష్టపూర్వకంగానే అయోధ్యలో రామ మందిరం సాకారమవుతోందని.. ఆలయ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. ఇన్నాళ్లకు భారతీయుల ఆలయ నిర్మాణం సాకారమవుతోందని అన్నారు.
ఇక మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రామ మందిర నిర్మాణాన్ని స్వాగతించారు. శ్రీరాముడు ప్రతిఒక్కరి విశ్వాసానికి కేంద్రమన్నారు. రాముడి మీద విశ్వాసంతోనే దేశం ఇవాళ నడుస్తోందని.. శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణాన్నితాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
Read More
ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు