విషాదం.. పేలిన బాయిలర్.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ జిల్లాలోని మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలో అకస్మాత్తుగా ఓ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో కంపెనీలో ఉన్న ఐదుగురు..

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ జిల్లాలోని మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలో అకస్మాత్తుగా ఓ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో కంపెనీలో ఉన్న ఐదుగురు కార్మికులు మృతిచెందారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో.. ఐదుగురు తీవ్రంగా కాలిపోవడంతో స్పాట్‌లోనే మృతిచెందినట్లు సమాచారం. ఉమ్రేడ్ మండలం బేలా గ్రామంలోలో ఉన్న కంపెనీకి చెందిన ఓ బయోగ్యాస్ ప్లాంట్‌లో.. శనివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Read More
ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు