AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ రామా..! బీజేపీ నేత నోట.. అదే మాట..!

నిత్యం సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ లీడర్ సాక్షి మహారాజ్.. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్‌గా మారారు. ఈ సారి అయోధ్య రామమందిర నిర్మాణం అంశంపై స్పందించారు. అతి త్వరలో రామ మందిర నిర్మాణం జరగబోతోందని అన్నారు. అంతేకాదు వచ్చే డిసెంబర్ 6 వ తేదీ నుంచి మందిర నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాంయటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండు శతాబ్ధాల క్రితం సరిగ్గా ఇదే తేదీన బాబ్రీ […]

రామ రామా..! బీజేపీ నేత నోట.. అదే మాట..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 27, 2019 | 1:37 PM

Share

నిత్యం సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ లీడర్ సాక్షి మహారాజ్.. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్‌గా మారారు. ఈ సారి అయోధ్య రామమందిర నిర్మాణం అంశంపై స్పందించారు. అతి త్వరలో రామ మందిర నిర్మాణం జరగబోతోందని అన్నారు. అంతేకాదు వచ్చే డిసెంబర్ 6 వ తేదీ నుంచి మందిర నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాంయటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండు శతాబ్ధాల క్రితం సరిగ్గా ఇదే తేదీన బాబ్రీ మసీదు కూల్చివేయడం జరిగిందని.. ఇప్పుడు అయోధ్య అంశానికి సంబంధించిన విచారణ కూడా దాదాపు పూర్తికాబోతుందని అన్నారు. ఈ నేపథ్యంలో కూల్చివేసిన రోజునే మందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అనిపిస్తోందని అన్నారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా “మందిర్ వహీ బనాయేంగే” అంటూ నినాదం చేశారు. కాగా, అయోధ్య అంశంపై తరచుగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. కేసు ఇంకా సుప్రీంలో ఉందని.. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని చేతులెత్తి వేడుకుంటుంన్నానని ప్రధాని మోదీ అన్నారు. అయితే తరచుగా శివసేన రామ మందిర విషయం గురించి ప్రస్తావించడంతో అప్పుడు మోదీ శివసేనను టార్గెట్ చేస్తున్నారని అనుకున్నారు. అయితే సాక్షాత్తు ప్రధాని మోదీ వేడుకున్నా.. సాక్షి మహారాజ్ మాత్రం మరోసారి మందిర విషయంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. మరి పార్టీ అగ్ర నేతలు సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై ఏమైనా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Follow Us
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..