AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.17 వేలకే 10 ఎకరాలు..! ఎక్కడ, ఎలా కొనాలి? పూర్తి వివరాలు ఇవే

రూ.17 వేలకే 10 ఎకరాల భూమి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది భూమిపై కాదు.. చంద్రుడిపై! లూనార్ ఎంబసీ వంటి సంస్థలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నట్లు చెబుతున్నాయి. ఒక ఎకరానికి సుమారు రూ.1,700 నుంచి రూ.3,400 వరకు ధరలు ఉంటాయని ప్రచారం ఉంది.

రూ.17 వేలకే 10 ఎకరాలు..! ఎక్కడ, ఎలా కొనాలి? పూర్తి వివరాలు ఇవే
Land On Moon
SN Pasha
|

Updated on: Aug 17, 2026 | 7:00 PM

Share

భూమి కొనాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాకుంటే ప్రస్తుతం ప్రతీచోటా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా.. 100 గజాల ఇంటి స్థలం కొనాలన్నా భారీగా డబ్బు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ.1700 లకే ఒక ఎకరం, రూ.17 వేలకు 10 ఎకరాలు వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా? వందల ఎకరాలు కొనేయరు. అయితే ఇంతకీ ఇంత తక్కువ ధరకు స్థలం ఎక్కడ దొరుకుతుంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లూనార్ ఎంబసీ అనే సంస్థ చంద్రుడిపై స్థలానికి ధరలను నిర్ణయించి విక్రయిస్తున్నాయి. కొన్ని ప్రచారాల ప్రకారం ఒక ఎకరానికి సుమారు 20 నుంచి 40 అమెరికన్ డాలర్ల వరకు ధరలు ఉంటాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1,700 నుంచి రూ.3,400 వరకు ఉంటుంది. అయితే ప్రాంతం, ప్యాకేజీ, కొనుగోలు పరిమాణాన్ని బట్టి ధర మారవచ్చు. అయితే ఇది భూమిపై రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలు చేసే రియల్ ఎస్టేట్ లాంటిది కాదు. కొనుగోలుదారుడికి సాధారణంగా ఒక సర్టిఫికెట్ లేదా మ్యాప్ అందుతుంది.

షారుఖ్ ఖాన్‌కు చంద్రుడిపై భూమి ఉందా?

చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసిన ప్రముఖుల జాబితాలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పేరు తరచుగా వినిపిస్తుంది. ఆయన అభిమానులు చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. షారుఖ్‌కు చంద్రుడిపై సి అఫ్ ట్రాంక్విలిటీ ప్రాంతంలో స్థలం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి. అలాగే అంతరిక్షంపై ఆసక్తి ఉన్న దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా చంద్రుడిపై భూమిని కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. హాలీవుడ్ ప్రముఖులైన టామ్ క్రూజ్, నికోల్ కిడ్మన్, జాన్ ట్రావోల్టా తదితరుల పేర్లు కూడా ఈ విషయంలో వినిపిస్తాయి.

ఇది నిజంగా చట్టబద్ధమైన యాజమాన్యమేనా?

ఇదే అసలు ట్విస్ట్. అంతర్జాతీయ అంతరిక్ష చట్టం ప్రకారం చంద్రుడిని ఏ దేశం తన భూభాగంగా ప్రకటించుకోలేదు. 1967 Outer Space Treatyలో ఖగోళ వస్తువులు జాతీయ స్వాధీనం నుంచి మినహాయించబడ్డాయి. అయితే వ్యక్తిగతంగా విక్రయిస్తున్న చంద్రుడి భూమిపై ప్రైవేట్ యాజమాన్య హక్కులను ఆ సంస్థలు చట్టబద్ధంగా సృష్టించగలవా అనే అంశంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన గుర్తింపు లేదు. చంద్రుడిపై భూమి కొనడం.. వినడానికి సినిమా కథలా అనిపించినా, కొన్నేళ్లుగా ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.

Follow Us