Ram Navami 2024: అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. ! ఇవీ పూర్తి వివరాలు..

|

Apr 16, 2024 | 10:33 AM

శ్రీరామనవమి పురస్కరించుకుని అన్ని ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరామ నవమి రోజున స్వామి వారికి అన్ని రకాల పూలు పళ్లతో పాటు పానకం, బెల్లం, వడపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు.

Ram Navami 2024: అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. ! ఇవీ పూర్తి వివరాలు..
Ram Navami
Follow us on

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. నవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఊరూ, వాడలా ఆలయాలు, వీధులన్నీ ముస్తాబు చేశారు.. చైత్ర మాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు భక్తులు. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడానికి సకలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్బంగా అయోధ్య శ్రీ రామ మందిర్ ట్రస్ట్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనాన్ని రద్దు చేశారు. ఏప్రిల్ 15 నుంచి 18 వరకు నవరాత్రుల నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనం నిషేధించబడింది. అయోధ్యలోని రామమందిరంలో రామనవమి సందర్భంగా దర్శనానికి వీఐపీ పాస్‌లపై నిషేధించారు. ట్రస్ట్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 18 వరకు భక్తులకు హారతి కోసం ఎటువంటి రాయితీ దర్శనం లేదా VIP పాస్‌లు అందుబాటులో ఉండవు.

అంటే రామ నవమి రోజున సాధారణ, ప్రత్యేక భక్తుల దర్శన ఏర్పాట్లు అలాగే యధావిధిగా అమలు చేయనున్నారు. శ్రీరాముడు ఈ నాలుగు రోజులలో భక్తులందరికీ ఒకే విధమైన దర్శనం ఇస్తాడు. ఎవరికీ ప్రత్యేక పరిస్థితులు, వెసులుబాటు కల్పించేది ఉండదు. రామనవమి రోజు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి ప్రజలను అభ్యర్థించారు. రాముడి దర్శనం కోసం గతంలో జారీ చేసిన పాస్‌లను రామమందిర్ ట్రస్ట్ రద్దు చేసినట్లు రామజన్మభూమి తెలియజేసింది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరాన్ని జనవరి 22న ప్రారంభించారు.

శ్రీరామ నవమి పండగ వేళ భక్తులు ఉపవాసం ఉండటం, దేవాలయాలను సందర్శించడం చేస్తుంటారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అన్ని ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరామ నవమి రోజున స్వామి వారికి అన్ని రకాల పూలు పళ్లతో పాటు పానకం, బెల్లం, వడపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..