Raksha Bandhan: హిందూ సాంప్రదాయ పండగల్లో ఒకటి రాఖీపండగ. ఈ పర్వదినాన్ని సోదర-సోదరీ బంధానికి గుర్తుగా జరుపుకుంటారు. రాఖీ పండగ సందర్భంగా ప్రతి సోదరి తన సోదరునికి రాఖీ కట్టాలని కోరుకుంటుంది. అందుకు అందమైన రాఖీని ఎంపిక చేసుకుంటుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని మార్కెట్ లో అందమైన రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. రూ.10 నుంచి లక్షలు విలువ జేసే రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ డిజైనర్ తన సృజనాత్మకతకు పదును పెట్టి.. సరికొత్త రాఖీలను తయారు చేశాడు.
గుజరాత్‌కు చెందిన డిజైనర్ రాఖీలను దారం, విలువైన రాళ్లను ఉపయోగించి ప్రత్యేకమైన ‘డైమండ్ రాఖీ’ని రూపొందించాడు. ఈ రాఖీల స్పెషల్ ఏమిటంటే.. వీటిని రీసైకిల్ చేయవచ్చునని పేర్కొన్నాడు. గుజరాత్‌కు చెందిన వ్యాపారి విలువైన ఆభరణాలే కాదు.. బంగారాన్ని ఉపయోగించి ‘డైమండ్ రాఖీ’లను తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం అలోచించి సరికొత్తగా ఎకో రాఖీలను తయారు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI తెలిపింది. ఈ ఎకో రాఖీ ధర సుమారు రూ. 3,000 నుంచి రూ. 8,000 వరకు ఉంటుందని తయారీదారు చెప్పారు. ఈ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా తయారు చేసిన ఎకో రాఖీలను రీసైకిల్ చేసిన బంగారంతో తయారు చేసామని, డిజైన్ లో డైమండ్స్ ను ఉపయోగించినట్లు రాఖీ తయారీదారు వ్యాపారవేత్త రజనీకాంత్ చాచంద్ ANI కి చెప్పారు. ఈ డైమండ్ రాఖీలను గుజరాత్‌లోని సూరత్ నగరంలో వ్యాపారవేత్త రజనీకాంత్ చాచంద్ విక్రయిస్తున్నారు.
Gujarat | Diamond Rakhis being sold in Surat ahead of the festival of Rakshabandhan
We have made eco-friendly rakhis that are made up of recycled gold while diamond has been used in a special way. It will cost around Rs 3,000 to Rs 8,000: Rajnikant Chachand, Businessman pic.twitter.com/Cv9D7kaowp
— ANI (@ANI) August 2, 2022
ఈ సంవత్సరం రాఖీపండగను తోబుట్టువుల మధ్య ప్రేమకు చిహ్నంగా ఆగస్టు 11 న జరుపుకోనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..