Bihar cm nitish kumar Raksha Bandhan: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. చెట్లకు రాఖీ కట్టి వేడుక చేసుకున్నారు. మానవాళిని కాపాడుకోవడానికి పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం నితీష్ అన్నారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి రక్షాబంధన్ రోజును వృక్ష రక్షా దివస్‌గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెట్టుకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బీహార్ రాజధాని పాట్నాలో చెట్లకు రాఖీ బంధన్ చేశారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి రక్షాబంధన్ రోజును వృక్ష రక్షా దివస్‌గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెట్టుకు రాఖీ కట్టి పర్యవరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు కృషీ చేయాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని కాపాడి, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జల జీవన్ హరియాలీ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మొక్కలను నాటడంపై ప్రధానంగా దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు.
Bihar CM Nitish Kumar ties rakhis to trees in Patna on #Rakshabandhan to spread awareness on environmental conservation.
“Since 2012, we’ve been observing Rakshabandhan as ‘Vriksh Raksha Diwas’ (Tree Protection Day). People should save trees, just like they save people,” he says pic.twitter.com/Gx6LKAmDlL
— ANI (@ANI) August 22, 2021
పర్యావరణ పరిరక్షణ పట్ల భావి తరాలకు అవగాహన కల్పించడం ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు… కాగా అన్నాచెల్లెళ్ళ ఆత్మీయానురాగాలకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటుండగా దాన్ని పర్యవరవరణ పరిరక్షనకు సీఎం నితీష్ ఉపయోగించుకోవడం మంచి పరిణామమే…
Read Also… TS Corona: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న కోలుకున్న వారి సంఖ్య
వర్సిటీల్లో వింత చేష్టలు…శోభనానికి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లు..! – Watch Video