ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. మొదట మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన సభ ప్రతిపక్షం డివిజన్‌కు పట్టుబట్టడంతో రెండోసారి ఓటింగ్ జరిపింది. ఎన్డీఏకి మద్దతు పలికిన పార్టీల్లో వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, టీడీపీ ఉన్నాయి. ఈ క్రమంలో సభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల నుంచి ముగ్గురు సభ్యులు క్రాస్ ఓటింగ్‌తో మద్దతునిచ్చారు. కాగా బిల్లు పూర్తిగా రాజ్యాంగానికి లోబడే ఉందన్నారు అమిత్‌షా . ఢిల్లీలో ఆప్ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని , అందుకే బిల్లును సమర్థిస్తునట్టు తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మరోవైపు ఏ అవసరాల కోసం విజయసాయి ఈ బిల్లుకు మద్దతిచ్చారో తనకు తెలియదన్నారు బీఆర్‌ఎస్ ఎంపీ కేకే. అంతకుమందు ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. విపక్షాల ఆందోళన మధ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఢిల్లీలో పాలనాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును లోక్‌సభ ఇప్పటికే ఆమోదించింది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుతో లెఫ్టినెంట్ గవర్నర్‌ను సూపర్ సీఎం చేశారని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ. ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఇద్దరు బ్యూరోక్రాట్లను పెత్తనం చెలాయించడానికి నియమించారని మండిపడ్డారు.
మరోవైపు ఆప్ పాలనలో ఢిల్లీలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ బిల్లును వైసీపీ సమర్ధిస్తుందన్నారు. ఇండియా కూటమి బిల్లుపై అనవసరంగా రాద్దాంతం చేస్తోందన్నారు. ఢిల్లీ అంటే కేవలం ఆప్ పార్టీ సొంతం కాదని , దేశానికి రాజధాని అన్నారు . ఈడీ భయంతోనే వైసీపీ బిల్లుకు మద్దతిస్తునట్టు ఆప్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘ బిల్లుపై అనవసరంగా వివాదం సృష్టించారు. తొలుత కాంగ్రెస్ ,ఆప్ మిత్రపక్షాలు.. ఇండియా కూటమి అనవసరంగా వివాదం సృష్టించింది. నిప్పు అంటుకుంటే చివరి ఇళ్లు కూడా తగలబడుతుందని ఆప్ ఎంపీ రాఘవ్ ఛడ్డా అన్నారు. బిల్లుకు మద్దతివ్వాలని ఎన్‌డీఏ కూటమిలో లేని పార్టీలపై ఒత్తిడి చేశారని అన్నారు . ఈడీ మీ ఇంటికి కూడా వస్తుంది
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యాంగ విరుద్దమని , తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు బీఆర్‌ఎస్ ఎంపీ కే,కేశవరావు. ఏ అవసరాలతో వైసీపీ సాయిరెడ్డి బిల్లుకు మద్దతిస్తున్నారో తనకు తెలియదన్నారు కేకే. ‘ బిల్లును మేము వ్యతిరేకించడానికి కారణాలు ఉన్నాయి. సాయిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెప్పిందో తెలియదు. ఎవరి అవసరాలు వాళ్లకు ఉంటాయి. విజయసాయి అవసరాలు మాకు తెలియదు’ అని కేకే తెలిపారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యాంగబద్దమే అని అన్నారు అమిత్‌షా. మిగతా రాష్ట్రాలకు ఢిల్లీకి చాలా తేడా ఉందన్నారు. ఢిల్లీలో ప్రతి అంశంపై చట్టం చేసే అధికారం కేంద్రానికి రాజ్యాంగం కల్పించిందన్నారు. అవినీతిని నిరోధించడానికే బిల్లును తీసుకొచ్చినట్టు తెలిపారు అమిత్‌షా.
Delhi | On Delhi Services Bill passed in Rajya Sabha, Delhi CM Arvind Kejriwal says, “PM Modi does not obey the Supreme Court’s order. The public had clearly said that the Centre should not interfere in Delhi by defeating them, but PM does not want to listen to the public.” pic.twitter.com/Y25XLo7BF2
— ANI (@ANI) August 7, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..