Rajiv Gandhi Assassination Case: విడుదల చేయండి.. రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని..

|

Aug 12, 2022 | 11:34 AM

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ( Convict Nalini ) తనను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Rajiv Gandhi Assassination Case: విడుదల చేయండి.. రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని..
Rajiv Gandhi Assassination
Follow us on

Rajiv Gandhi assassination case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ( Convict Nalini ) తనను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నళిని జూన్ 17న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసింది. మద్రాస్ హైకోర్టు ముందస్తు విడుదల కోసం ఆమె చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, ఇదే కేసులో దోషిగా ఉన్న ఎజి పెరారివాలన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయడాన్ని ఆమె గుర్తు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రవిచంద్రన్‌ కూడా విడుదల చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళినీ శ్రీహరన్, రవిచంద్రన్‌, రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండానే తమను విడుదల చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని జూన్ 17న తిరస్కరించింది. దీంతో ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

31 ఏళ్లకుపైగా జైలు జీవితాన్ని అనుభవించానని, తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ నళిని శ్రీహరన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై 2015 నుంచి తమిళనాడు గవర్నరు వద్దే పెండింగ్‌లో ఉందని, నళిని పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని ఆమె తరపున న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఇదే హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన ఎజీ పేరారివాలన్‌ను విడుదల చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారం మే 18న సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను వినియోగించింది. 30 ఏళ్లు పైగా శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో విడుదల చేయాలని పేర్కొంది.

ఏజీ పెరారివాలన్‌ విడుదల తర్వాత, రవిచంద్రన్‌, ఆయనతో సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ సైతం ప్రభుత్వాన్ని కోరారు. గవర్నరు విడుదల ఫైళ్లను మూడేళ్లుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంచారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమంటూ వారు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..