Laluprasad Yadav : ఆమె లాలూ కుటుంబానికి అదృష్ట దేవత.. బీహార్ మొత్తం ఇదే ప్రచారం
కుటుంబంలో కొంతమందిని అదృష్ట వంతులుగా భావిస్తుంటాం.. పలానా ఇంట్లో పలానా వారొచ్చాక మంచిరోజులచ్చాయంటుంటాం.. పలానా అబ్బాయో, అమ్మాయో పుట్టాక మాకు మంచి జరుగుతోంది అంటుంటాం.. సరిగ్గా ఇప్పుడు బీహార్ లో ఇలాంటి టాకే ఒకటి వినిపిస్తోంది.
Bihar Politics: కుటుంబంలో కొంతమందిని అదృష్ట వంతులుగా భావిస్తుంటాం.. పలానా ఇంట్లో పలానా వారొచ్చాక మంచిరోజులచ్చాయంటుంటాం.. పలానా అబ్బాయో, అమ్మాయో పుట్టాక మాకు మంచి జరుగుతోంది అంటుంటాం.. సరిగ్గా ఇప్పుడు బీహార్ లో ఇలాంటి టాకే ఒకటి వినిపిస్తోంది. కోడలి రాకతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం తలరాతే మారిపోయిందంట.. చాలా సంవత్సరాల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బీహార్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. దీంతో అక్కడి కార్యకర్తలు, ఆర్జేడీ నాయకులు తెగ ఆనందపడుతున్నారంట..
2005 నుంచి అధికారానికి ఆర్జేడీ దూరంగా ఉంది. అయితే 2015 నుంచి 2017 వరకు 18 నెలల పాటు తేజస్వి యాదవ్ మహా ఘట్ బంధన్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆసమయంలో తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగానూ పనిచేశారు. ఆతర్వాత మహాఘట్‌బంధన్ నుంచి జెడియు బయటకి వెళ్లి బిజెపితో పొత్తు పెట్టుకుంది. ఆతర్వాత తేజస్వి యాదవ్ తన చిరకాల స్నేహితురాలు రాజశ్రీ అకా రాచెల్‌తో 2021 డిసెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. ఈవివాహం అయిన తొమ్మిది నెలల తర్వాత తేజస్వి యాదవ్ మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. అలాగే తేజస్వి వివాహం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కి ఆరోగ్య కారణాలతో బెయిల్ వచ్చింది. దీంతో లాలూ ప్రసాద్ కుటుంబానికి రాజశ్రీ యాదవ్ అదృష్టవంతురాలిగా మారిందని బీహార్ లో ప్రచారం సాగుతోంది. ఆమె రాక తర్వాత లలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయని చర్చ సాగుతోంది. మొత్తం మీద తేజస్వి భార్యను లాలుకుటుంబం అదృష్ట దేవతగా భావిస్తోందంట..
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..