Rajinikanth: తమిళులు గర్వపడేలా చేశారు.. సెంగోల్‌ ప్రతిష్ఠాపనపై ప్రధాని మోడీకి రజనీకాంత్‌ ప్రత్యేక ధన్యవాదాలు

|

May 28, 2023 | 9:57 AM

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై స్పందించారు. సెంగోల్‌ను తమిళ శక్తికి ప్రతీకగా అభివర్ణించిన రజనీకాంత్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

Rajinikanth: తమిళులు గర్వపడేలా చేశారు.. సెంగోల్‌ ప్రతిష్ఠాపనపై ప్రధాని మోడీకి రజనీకాంత్‌ ప్రత్యేక ధన్యవాదాలు
Rajinikanth, Pm Modi
Follow us on

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటులో స్పీకర్ కుర్చీ సమీపంలో బంగారు రాజదండం (సెంగోల్‌)ను ప్రతిష్టించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్రోద్యమం అనంతరం బ్రిటీష్ పాలకులకు, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మధ్య అధికార బదలాయింపునకు గుర్తుగా ఈ రాజదండం నిదర్శనంగా నిలిచింది. ఈ రాజదండాన్ని ‘సెంగోల్’ అని అంటారు. ఇది తమిళ పదం. చోళ రాజుల కాలం నుంచి ఈ రాజదండం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై స్పందించారు. సెంగోల్‌ను తమిళ శక్తికి ప్రతీకగా అభివర్ణించిన రజనీకాంత్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ‘తమిళ శక్తికి సాంప్రదాయ చిహ్నం సెంగోల్. ఇది ఇప్పుడు కొత్త పార్లమెంటులో మరింత ప్రకాశిస్తుంది. ఈ సందర్భంగా తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు రజనీకాంత్‌.

 

ఇవి కూడా చదవండి

కాగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడుకు చెందిన మరాధిపతులైన ఆధీనుల ఆశీస్సులు తీసుకున్నారు. తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చిన వారిని ప్రధాని మోడీ తన నివాసంలో కలుసుకున్నారు. మరాధిపతుల ఆశీస్సులు అందుకున్న మోడీ శాస్త్రోక్తంగా ‘సెంగోల్‌’ ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆధీనులకు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేసి వారికి అభినందనలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..