Rajinikanth: వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి రాజకీయాలకు దూరం చేశారు.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు..

|

Mar 12, 2023 | 9:38 AM

దేశ ఉపాధ్యక్ష పదవిపై సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చేసిన కామెంట్స్‌.. కాక పుట్టిస్తున్నాయ్‌. ఏమాత్రం పవర్‌లేని ఆ పదవి.. కేవలం ఆరువేలు మాదిరి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

Rajinikanth: వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి రాజకీయాలకు దూరం చేశారు.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు..
Venkaiah Naidu, Rajinikanth
Follow us on

దేశ ఉపాధ్యక్ష పదవిపై సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చేసిన కామెంట్స్‌.. కాక పుట్టిస్తున్నాయ్‌. ఏమాత్రం పవర్‌లేని ఆ పదవి.. కేవలం ఆరువేలు మాదిరి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. దేశవిదేశాల్లో అభిమానగణాన్ని సంపాదించుకున్న రజినీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కొత్త డిస్కషన్‌కు బీజం వేసింది. అయితే, రజినీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేసిన ఉద్దేశ్యం మాత్రం వేరు. జాతీయస్థాయిలో తెలుగుఖ్యాతిని చాటిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని పొగిడే క్రమంలో జరిగింది ఇదంతా. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో… వెంకయ్యతో కలిసి వేదిక పంచుకున్న రజినీ.. వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టు పవర్‌ లెస్‌ అని తేల్చేశారు. వెంకయ్యలాంటి గొప్ప నాయకుడికి.. ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి రాజకీయాలకు దూరం చేయడం తనకు నచ్చలేదన్నారు. సాధారణంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవులు చేపట్టడమంటే.. ఇండియాలో ప్రతక్షరాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్టే. ఆ లెక్కన, పార్టీలకతీతంగా గౌరవించే వెంకయ్యనాయుడికి.. దక్కాల్సిన స్థాయిలో గౌరవం దక్కలేదన్నదే సూపర్‌స్టార్‌ ఆవేదనగా తెలుస్తోంది. మరి, ఈ వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు ఏమంటారో వేచిచూడాల్సిందే.

ఇదిలాఉంటే.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం రజనీకాంత్‌కు ఓ సలహా ఇచ్చారు. రాజకీయాల్లోకి రావడం మంచిది కాదంటూ రజనీకాంత్‌కు సలహా ఇచ్చారు. సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ (SPF) యొక్క రజతోత్సవ వేడుకలో పాల్గొన్న వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే విషయం తెలిసి వద్దని చెప్పినట్లు వెల్లడించారు. ప్రజలకు సేవ చేసేందుకు మెరుగైన మార్గాలు ఉన్నాయని తెలియజేసినట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..