AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: షాకింగ్ ఘటన.. రూ. 4 వేల పెట్రోల్ కోసం ఉద్యోగి ప్రాణాలతో ఆట.. CCTVలో భయానక దృశ్యాలు!

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని కాందోలి పెట్రోల్ పంప్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన కొందరు వ్యక్తులు సుమారు రూ. 4 వేల విలువైన పెట్రోల్ పోయించుకుని, డబ్బులు చెల్లించకుండా పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-21 (NH-21) పక్కన ఉన్న కాందోలి పెట్రోల్ పంప్‌లో జరిగింది.

Car Dragged Petrol Pump Employee
Balaraju Goud
|

Updated on: Jul 09, 2026 | 5:16 PM

Share

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని కాందోలి పెట్రోల్ పంప్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన కొందరు వ్యక్తులు సుమారు రూ. 4 వేల విలువైన పెట్రోల్ పోయించుకుని, డబ్బులు చెల్లించకుండా పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-21 (NH-21) పక్కన ఉన్న కాందోలి పెట్రోల్ పంప్‌లో జరిగింది.

పెట్రోల్ పోయించిన అనంతరం యూపీఐ (UPI) ద్వారా చెల్లింపు చేస్తామని నిందితులు ఉద్యోగిని నమ్మించారు. ఆ తర్వాత మాటల్లో పెట్టి ఒక్కసారిగా కారును వేగంగా ముందుకు దూకించారు. పరిస్థితిని గుర్తించిన ఉద్యోగి కారును ఆపేందుకు ప్రయత్నించగా, అతడిని కారుతో కొంతదూరం ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని దౌసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి చేయి విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఈ దారుణ ఘటన మొత్తం పెట్రోల్ పంప్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దృశ్యాల్లో నిందితులు డబ్బులు చెల్లించకుండా పారిపోవడం, ఉద్యోగిని కారుతో ఈడ్చుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పెట్రోల్ పంప్ యాజమాన్యం, బాధిత ఉద్యోగి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు, వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?

'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్

రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!

నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి

పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!