బెగ్గర్లకు వరాలు కురిపిస్తున్న ప్రభుత్వం.. వారి కోసం చేస్తున్న ఒక్కో పని తెలిస్తే అవాక్కే..
భారత్‌లో ఎంత మంది ధనికులుగా మారిన.. అంత కంటే ఎక్కువ శాతం యాచకులుంటారన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్ళిన ఎక్కడో ఒకచోట
భారత్‌లో ఎంత మంది ధనికులుగా మారిన.. అంత కంటే ఎక్కువ శాతం యాచకులుంటారన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్ళిన ఎక్కడో ఒకచోట మనకు బెగ్గర్స్ ఎదురుపడుతుంటారు. వారికి కొంత మంది సాయం చేసినా.. మరికొంతమంది ముఖం తిప్పుకొని పోతుంటారు. కానీ రాజస్థాన్ ప్రభుత్వం వారి కోసం ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం జైపూర్‌లో బెగ్గర్ ఫ్రీ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రాజస్తాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఆర్‌ఎస్‌ఎల్‌డీసీ), సోపన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు 43 మంది బెగ్గర్స్ ఉన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి వచ్చి జైపూర్‌లో యాచకులుగా మారినవారిని ఈ సంస్థ చేరదీసింది. వీరికి ఉచితంగా సదుపాయం కల్పించి.. యోగా నేర్పించడం, ఆటలు ఆడించడం, కంప్యూటర్ క్లాసెస్ నిర్వహించడం చేస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిరజ్ కుమామర్ పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యాచకులందరిని మంచి పౌరులుగా తీర్చిదిద్ది.. బెగ్గర్స్ లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను చేయాలని సీఎం ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. జైపూర్‌లో పోలీసులతో కలిసి నిర్వహించిన సర్వే ఆధారంగా ఇక్కడ బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించాం.. దీనికోసం కౌశల్ వర్ధన్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. బ్యాచుల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఇందులో 20 మందిని ఒక బ్యాచ్‌గా, 20 మందిని ఒక బ్యాచ్‌గా చేసి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభిస్తామని తెలిపారు. సమాజంలో వీరికి గౌరవమైన జీవితాన్ని అందించడమే తమ లక్ష్యమని సోపన్ సంస్థ అధికారి తెలిపారు. మూడున్నర నెలలపాటు వీరికి శిక్షణ ఇవ్వడంతోపాటు.. రోజుకు రూ.215 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సాధరణ మనుషులతో పోలిస్తే వీరు కాస్త విభిన్నంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుకోసం వీరితో నేరుగా మాట్లాడి.. మానసిక, శారీరక స్థితిగతులను అంచనావేసి.. ఆ తర్వాత వీరికి కావాల్సిన యోగ శిక్షణ ఇవ్వనున్నట్లుగా యోగా ట్రైయినర్ తెలిపారు.
Also Read: