మిథున్ చక్రవర్తితో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ, మాది ఆధ్యాత్మిక ‘మైత్రి’ అంటున్న డ్యాన్సింగ్ స్టార్
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం అలనాటి సీనియర్ నటుడు, 'డ్యాన్సింగ్ స్టార్' మిథున్ చక్రవర్తితో ముంబైలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం అలనాటి సీనియర్ నటుడు, ‘డ్యాన్సింగ్ స్టార్’ మిథున్ చక్రవర్తితో ముంబైలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ సుమారు గంటకు పైగా జరిగింది. వీరు మరోసారి కూడా సమావేశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి పొలిటికల్ కలర్ ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు మిథున్.. అలాంటిదేమీ లేదన్నారు. తనకు, మోహన్ భగవత్ కు మధ్య స్నేహం ఆధ్యాత్మికమైనది, గాఢమైనది కూడా అని ఆయన చెప్పాడు. ముంబైలో నన్ను కలుస్తానని ఆయన లోగడ హామీ ఇఛ్చారని, దీంతో లక్నోలో ఓ షూటింగ్ ముగించుకుని తానిక్కడికి రాగానే ఆయన తనను కలిశారని వెల్లడించాడు. ‘మేం ఇద్దరం బ్రేక్ ఫాస్ట్ చేసాం..నాగ పూర్ వచ్చి తనను కలవాల్సిందిగా భగవత్ నన్ను ఆహ్వానించారు అని మిథున్ చక్రవర్తి చెప్పాడు. ఈ మీటింగ్ వెనుక రాజకీయ ఉద్దేశాలేవీ లేవన్నాడు. ఈ విధమైన ఊహాగానాలు ఉంటే తను బెంగాల్ లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవాడినేమో అంటూ ఆయన నవ్వేశారు.
ముంబైలో ఉంటున్నప్పటికీ ఈ 1990 నాటి డ్యాన్సింగ్ స్టార్ కి బెంగాల్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ రాష్ట్రంలో పలు డ్యాన్సింగ్ రియాల్టీ షోలకు మిథున్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. కాగా బీజేపీ ఇప్పటికే బెంగాల్ లో అయిదు పరివర్తన్ యాత్రలను నిర్వహించింది. ఈ పార్టీ సిధ్ధాంతకర్త అయిన మోహన్ భగవత్.. ఈ సీనియర్ నటుడిని కలవడం వెనుక కచ్చితంగా రాజకీయ ఉద్దేశమే ఉండవచ్చునంటున్నారు.
Also Read:
Indian Navy Jobs With 10th, Inter Qualification Video: పది పాసైతే చాలు ఇండియన్ నేవీలో జాబ్ లు.
‘వార్ యోచన ‘బేర్’మంది, టెంట్లు పీకేసి, పాంగాంగ్ లో చైనా సేనల ఖాళీ, ట్రక్కుల్లో తిరుగుముఖం