రేషన్ కార్డు వదులుకోవాలన్న వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన కర్ణాటక మంత్రి.. అలాంటి ఆలోచన లేదని వివరణ

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డు హోల్డర్లపై చేసిన ప్రకటనపై కర్ణాటక మంత్రి వెనక్కు తగ్గారు. ఈ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

రేషన్ కార్డు వదులుకోవాలన్న వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన కర్ణాటక మంత్రి.. అలాంటి ఆలోచన లేదని వివరణ
Balaraju Goud

|

Feb 16, 2021 | 4:59 PM

U turn on bpl cards : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డు హోల్డర్లపై చేసిన ప్రకటనపై కర్ణాటక మంత్రి వెనక్కు తగ్గారు. టీవీ, ఫ్రిజ్‌ లాంటి వస్తువులుంటే రేషన్‌ కార్డులు వదులుకోవాలంటూ కర్ణాటక ఆహార, పౌర సరఫరా మంత్రి ఉమేష్ కత్తి చేసిన ప్రకటన తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్‌ బియ్యం కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

బెళగావిలో సోమవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఉమేశ్.. రేషన్‌ కార్డులపై సంచలన ప్రకటన చేసిన త్వరలో టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్ కార్డు కట్ అవుతుందని ప్రకటించారు. టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్నవారు బీపీఎల్‌ రేషన్‌ కార్డులు వదులుకోవాలని లేదంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. దీంతో దిగివచ్చిన మంత్రి.. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ నుంచి నాకు వచ్చిన సమాచారాన్ని నేను మీడియాతో పంచుకున్నానని వివరణ ఇచ్చారు. టీవీ, ఫ్రిజ్‌ లాంటి పరామితులపై నేను గానీ, ముఖ్యమంత్రి యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు రాగి, మొక్కజొన్న, బియ్యం వంటి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం కొనసాగిస్తుందని ఆయన అన్నారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

Read Also…  పల్లాను పరామర్శించిన చంద్రబాబు.. నాటి ప్రాణ త్యాగాన్ని కొనేయాలనుకుంటున్నారా అంటూ ధ్వజం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu