AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వాళ్ళ ఆలోచనలను ప్రక్షాళన చేయాల్సిందే’, దిశారవి ఉదంతంపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్

టూల్ కిట్ డాక్యుమెంట్ విషయంలో క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి చేసిన ట్వీట్ల తాలూకు సెగ ఇంకా ఆరలేదు. దేశద్రోహం, కుట్ర కింద దిశారవిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 

'వాళ్ళ ఆలోచనలను ప్రక్షాళన చేయాల్సిందే', దిశారవి ఉదంతంపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 16, 2021 | 5:44 PM

Share

టూల్ కిట్ డాక్యుమెంట్ విషయంలో క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి చేసిన ట్వీట్ల తాలూకు సెగ ఇంకా ఆరలేదు. దేశద్రోహం, కుట్ర కింద దిశారవిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఉదంతంపై స్పందించిన  హర్యానా హోం  మంత్రి అనిల్ విజ్.. దేశ వ్యతిరేక ఆలోచనలు (బీజాలు) గల వారినందరినీ నాశనం చేయాలని ట్వీట్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యపై నిరసనలు పెల్లుబికాయి. ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు జర్మనీలో ట్విటర్ కొద్దిసేపు ఈ ట్వీట్ ను తొలగించింది. అయితే దీనిపై ఇన్వెస్టిగేట్ చేశామని, తొలగించటానికి ఇది తగినది కాదని భావించామని అంటూ దీన్ని మళ్ళీ పునరుధ్ధరించింది. అటు-తన వివాదాస్పద కామెంట్ పై వివరణ ఇచ్చిన అనిల్ విజ్.. జాతి వ్యతిరేక ఆలోచనలు గలవారిని నాశనం చేయాలన్న తన ట్వీట్ ఉద్దేశం నిజానికి అది కాదని, అలాంటి వారి మెదళ్లను ప్రక్షాళన చేయాలన్నదేనని అన్నారు. ఈ విధమైన ఆలోచనలను శుద్ది చేయాలని తాను కోరుతున్నానన్నారు. వీళ్ళు (దిశారవి వంటివారు) ఇంగ్లీషు  స్కూళ్లలో చదువుకున్నవారని, వీరికి హిందీ భాష రాదని చెప్పారు. అసలు నా ట్వీట్ లో ఏముంది అని ఆయన నవ్వేశారు.

‘నా ట్వీట్ ను మళ్ళీ ట్విటర్ పోస్ట్ చేసిందిగా..ఇందులో తప్పేముందని  అని స్పష్టం చేసిందిగా ‘అన్నారు. ఇలా ఉండగా దిశారవి అరెస్టు పెద్ద దుమారాన్నే సృష్టించింది. తన కేసుపై వాదించిన ఆమె.. తనేమీ టూల్ కిట్ ను రూపొందించలేదని, నిరసన చేస్తున్న రైతులకు మద్దతు ఇవ్వాలని తాము కోరుతున్నామని వెల్లడించింది. ఈ నెల 3 నే రెండు లైన్లను ఎడిట్ చేసినట్టు పేర్కొంది. ఈమెకు 5 రోజులపాటు పోలీసు కస్టడీకి రిమాండ్ చేశారు. ఈ కేసులో లాయర్ అయిన నిఖితా జాకబ్, యాక్టివిస్ట్ శంతను ములుక్ పేర్లను కూడా పోలీసులు తమ ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు.

మరిన్ని చదవండి ఇక్కడ:

బెగ్గర్లకు వరాలు కురిపిస్తున్న ప్రభుత్వం.. వారి కోసం చేస్తున్న ఒక్కో పని తెలిస్తే అవాక్కే..

రేషన్ కార్డు వదులుకోవాలన్న వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన కర్ణాటక మంత్రి.. అలాంటి ఆలోచన లేదని వివరణ

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!