AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లాను పరామర్శించిన చంద్రబాబు.. నాటి ప్రాణ త్యాగాన్ని కొనేయాలనుకుంటున్నారా అంటూ ధ్వజం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా..

పల్లాను పరామర్శించిన చంద్రబాబు.. నాటి ప్రాణ త్యాగాన్ని కొనేయాలనుకుంటున్నారా అంటూ ధ్వజం
K Sammaiah
|

Updated on: Feb 16, 2021 | 4:25 PM

Share

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్షకు చంద్రబాబు మద్దతు పలికారు. విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లాను చంద్రబాబు కలిసి సంఘీభావం ప్రకటించారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు తన దీక్షతో ఊపిరి పోశారని చంద్రబాబు అన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వీరోచితంగా పోరాడిన ఆంధ్రులు 32 మంది ప్రాణత్యాగం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రుల ఉద్యమానికి ఇందిరాగాంధీ సైతం దిగొచ్చారని తెలిపారు. విశాఖ ఉక్కుకోసం దారపోసిన ప్రాణత్యాగాల విలువ తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఓట్లు వేశాక జగన్ రెడ్డికి ప్రజలతో అవసరం తీరిపోయిందని, అందుకే ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడంలేదని విమర్శించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ 5 లక్షల మందికి ఉపాధి కల్పించింది. విశాఖలో ఎయిర్‌పోర్టు, మెట్రోకు శ్రీకారం చుట్టాం. విశాఖకు ఐటీ పరిశ్రమ, లులు షాపింగ్‌మాల్ రాకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులూ ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాయి. మీరు పాలకులా? కమీషన్ ఏజెంట్లా? విశాఖ ఉక్కు సంకల్పాన్ని కొనేయాలనుకుంటున్నారా?’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని చంద్రబాబు అభివర్ణించారు. ఇక్కడి ప్రజలు ఎంతో నీతి నిజాయతీపరులని, అందుకే ఈ నగరాన్ని తాను అమితంగా ఇష్టపడతానని వివరించారు. చంద్రబాబు వెంట ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేత సబ్బం హరి కూడా ఉన్నారు.

Read more:

ఎన్నికల కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు. ఆ విషయంలో ఓటరు కోరినట్టు చేయాల్సిందేనన్న ధర్మాసనం

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్