తొలి నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి.. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలి నామినేషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత..

తొలి నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి.. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే
Follow us

|

Updated on: Feb 16, 2021 | 4:40 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలి నామినేషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.

ఈనెల 23 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 5 లక్షల 60 వేలమంది ఓటర్లున్నారు. తనను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యపై రాజీలేని పోరాటం చేస్తానని, అవసరమైతే ఆమరణదీక్షకు దిగుతానన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి. తాను అజాతశత్రువునని, అందరూ తనకు మద్దతు పలుకుతారనే నమ్మకంతో ఉన్నారు చిన్నారెడ్డి.

Read more:

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి