వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తన స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా..

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి
Follow us

|

Updated on: Feb 16, 2021 | 4:08 PM

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తన స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర, జనగామ జిల్లా కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి, వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో టి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదుపై మండల పార్టీ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. మండలాల ముఖ్య నాయకులకు మంత్రి సభ్యత్వం ఇచ్చారు. మంత్రితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జీ లు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జన్ను జకార్య, స్థానిక నేతలు పాల్గొన్నారు.

పార్టీల‌కు కార్య‌క‌ర్త‌లే ప్రాణం. కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకునే పార్టీ టిఆర్ఎస్. పార్టీ స‌భ్య‌త్వాల లెక్క‌ల్లో రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలోనే టిఆర్ఎస్ నెంబ‌ర్ వ‌న్ గా ఉంది. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ స‌భ్య‌త్వం గ‌త ఏడాది వ‌ర‌కు 60 ల‌క్ష‌లు. ఈ ఏడాది ఈ స‌భ్య‌త్వాన్ని క‌నీసం 80ల‌క్ష‌ల‌కు పెంచాల‌నేది ల‌క్ష్యం. ఇది సీఎం కెసిఆర్ గారు సాధించిన ఘ‌న‌త. పార్టీని, ప్ర‌భుత్వాన్ని దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలుపుతున్నారు. దేశంలో ఇంత స‌క్సెస్ ఫుల్ గా న‌డుస్తున్న పార్టీ, ప్ర‌భుత్వం దేశంలో ఎక్క‌డా లేదు‌. 2015 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ర‌క‌ర‌కాల కారణాల వల్ల మ‌ర‌ణించిన 3వేల మంది కార్య‌క‌ర్త‌ల‌కు ఆస‌ర‌గా నిలిచాం. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌భ్య‌త్వాల‌ను కూడా ప‌క‌డ్బందీగా ఆన్ లైన్ చేసిన పార్టీ దేశంలో టిఆర్ఎస్ ఒక్క‌టే. స‌భ్య‌త్వం తీసుకున్న ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు పార్టీయే ఇన్సూరెన్స్ క‌డుతున్న‌ది. గ్రూపు ఇన్సూరెన్స్ కోసం వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల‌కు పార్టీ 47 కోట్లు చెల్లించింది.అన్నారు.

69 ఏండ్ల లోపు ఉన్న వాళ్ళు ఎవ‌రైనా స‌రే, స‌భ్య‌త్వం తీసుకోవ‌చ్చు. తెలంగాణ భ‌వ‌న్ తోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాల‌యాల ద్వారా స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. స‌భ్య‌త్వం తీసుకున్న ప్ర‌తి వారికీ ఇన్సూరెన్స్ స‌దుపాయాన్ని పార్టీ క‌ల్పించింది. ఇంత నిర్మాణాత్మ‌కంగా ప‌ని చేస్తున్న పార్టీలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలి. పార్టీని, ప్ర‌భుత్వాన్ని , కెసిఆర్ ని కాపాడుకుంటూనే…అండ‌గా నిలిస్తేనే… బంగారు తెలంగాణ అయిత‌దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఐకేపీ కొనుగోలు కేంద్రాలు అపొద్దని అంటున్నారు. నిజమే, మరి కనీస మద్దతు ధర ప్రకటించకుండా, కొనుగోలు చేస్తే, రైతులు తీవ్రంగా నష్టోయే ప్రమాదం ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయనకు కూడా అర్థం కావడం లేదు. ఆయన మంత్రి గా ఉన్నారు. కాస్త బాధ్యత తో మాట్లాడాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు పలికారు.

ఇక రానున్న కాలం లో సొంత స్థలాలు ఉన్న వాళ్లకు ఇండ్లు, బడుగులకు సబ్సిడీ రుణాలు అందించడానికి సీఎం కెసిఆర్ ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నారని మంత్రి వివరించారు. స్థానికంగా ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించు కుందాం. మన నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు కల్పించుకుందాము. పార్టీ తోనే ప్రభుత్వం. పార్టీ ని నిర్మాణాత్మకంగా, సభ్యత్వాల తర్వాత, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుందాం. అందరికీ సముచిత గౌరవం దక్కేలా ఉందామని మంత్రి చెప్పారు.

Read more:

కోటి వృక్షార్చన కార్యక్రమం అందుకే చేపట్టాం.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేసిన సంతోష్ కుమార్

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో