AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి వృక్షార్చన కార్యక్రమం అందుకే చేపట్టాం.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేసిన సంతోష్ కుమార్

ప్రకృతి, పచ్చదనం అవసరం బాగా తెలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. అందుకే రాష్ట్రం ఏర్పాటైన..

కోటి వృక్షార్చన కార్యక్రమం అందుకే చేపట్టాం.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేసిన సంతోష్ కుమార్
K Sammaiah
|

Updated on: Feb 16, 2021 | 3:34 PM

Share

ప్రకృతి, పచ్చదనం అవసరం బాగా తెలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. అందుకే రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. ఆరేళ్ల హరితహరం, మూడేళ్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్బంగా సీఎం పుట్టిన రోజు నాడు(ఫిబ్రవరి -17) హరిత కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోటి వృక్షార్చన చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణీకులకు వెయ్యి (1,000) ఔషధ మొక్కలు పంపిణీ చేశారు.

బుధవారం జరిగే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని స్వచ్ఛందంగా మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. కొచ్చిన్ నుంచి ఎయిర్ పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులు మొదటి మొక్కను అందుకున్నారు. పంజాబ్ నుంచి వచ్చిన అరుణ్ గుప్తా, సీమా గుప్తా, ముంబై నుంచి వచ్చిన చిన్నారులు ఆర్యా, జహార్ లు మొక్కలను అందుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తీసుకున్న మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రయాణీకులు ప్రశంసించారు. తమకు ఇచ్చిన మొక్కలను ప్రేమతో పెంచుకుంటామని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులు ముఖ్యమంత్రికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ పోర్టు సీఈఓ ప్రదీప్ పానేకర్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా తాము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్నామని, పచ్చదనం కోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా ఎయిర్ పోర్టు పరిసరాల్లో ప్రతీ యేటా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎం.కే.సింగ్, ఏవియేషన్ డైరెక్టర్ వీ.ఎన్. భరత్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి కరుణాకర్, రాఘవ, విమానాశ్రయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more:

స్పీకర్‌ కోర్టుకు చేరిన గంటా రాజీనామా బాల్‌.. రాజీనామా ట్విస్టులకు ఫుల్‌ స్టాప్‌ పెడతారా..? డ్రామా కంటిన్యూ అవుతుందా..?

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్