AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు. ఆ విషయంలో ఓటరు కోరినట్టు చేయాల్సిందేనన్న ధర్మాసనం

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకోండా తగిన జాగ్రత్తలతో..

ఎన్నికల కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు. ఆ విషయంలో ఓటరు కోరినట్టు చేయాల్సిందేనన్న ధర్మాసనం
ap-high-court
K Sammaiah
|

Updated on: Feb 16, 2021 | 3:13 PM

Share

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకోండా వీడియో తీయాలంటూ ఇటీవల ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో ఓటరు కోరితే వీడియో తీయాల్సిందేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

ఎన్నికల కౌంటింగ్‌లో వీడియోగ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలు అమలు కావడంలేదని, కనీసం మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనైనా ఓట్ల లెక్కింపును వీడియో తీసేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ విచారణలో ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. వీడియో తీసే అంశంలో ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు రెండ్రోజుల తర్వాత సవరణ ఉత్తర్వులు కూడా జారీ చేశామని చెప్పారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉండడంతో అక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఎలా వర్గీకరిస్తారంటూ ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని ధర్మాసనం ప్రశ్నించింది ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏ ఒక్క ఓటరు కోరినా, ఆ మేరకు వీడియో చిత్రీకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని హితవు పలికింది.

Read more:

వైయస్‌ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి