AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో పొలిటికల్ పార్టీల కంటే స్పీడ్‌గా ఉన్న ఎన్నికల సంఘం, మున్సిపల్ నోటిఫికేషన్ నడుమ రేపు మూడో విడత

హాఫ్‌ సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌... ఇంకో హఫ్‌ ఉండగానే మరో నోటిఫికేషన్. చూడబోతే, పార్టీల కంటే స్పీడ్‌గా ఉంది ఏపీలో ఎన్నికల సంఘం...

ఏపీలో పొలిటికల్ పార్టీల కంటే స్పీడ్‌గా ఉన్న ఎన్నికల సంఘం, మున్సిపల్ నోటిఫికేషన్ నడుమ రేపు మూడో విడత
Venkata Narayana
|

Updated on: Feb 16, 2021 | 2:43 PM

Share

హాఫ్‌ సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌… ఇంకో హఫ్‌ ఉండగానే మరో నోటిఫికేషన్. చూడబోతే, పార్టీల కంటే స్పీడ్‌గా ఉంది ఏపీలో ఎన్నికల సంఘం. పంచాయతీ ఎన్నికలు రెండు విడతలు పూర్తై ఇప్పుడు మరో ఫేజ్‌కు సిద్దమైంది. చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ పూర్తయింది. రేపు(బుధవారం) మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. 13జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3వేల221 పంచాయతీలు, 31వేల516 వార్డులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా… 579 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2వేల 640 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 21న లాస్ట్‌ ఫేజ్‌ ఎన్నికలు జరగనున్నాయి.

ఇప్పటికే రెండు విడతల్లో పూర్తిస్థాయి ఆధిపత్యం చూపించామంటున్న వైసీపీ… మూడో విడతలోనూ జోరు కొనసాగించాలని చూస్తోంది. తమ పార్టీ మద్దతుదారులు గెలిచి దీటుగా నిలబడ్డారని చెబుతున్న టీడీపీ… మరో రెండు విడతల్లోనూ సేమ్‌ సీన్ రిపీట్‌ అవుతుందని తెలిపింది. గెలుపు లెక్కలపై మాత్రం వైసీపీ, టీడీపీ మధ్య ఫైట్‌ పీక్స్‌కు చేరింది. తమదే పైచేయి అంటే తమదే పైచేయి అంటూ లెక్కలతో కన్ఫ్యూజ్‌ చేశారు. వాస్తవం ఏంటో తెలియక జనం తికమకపడుతున్నారు. పార్టీతో సంబంధం లేకుండా సాగిన ఎన్నికలైనందున దీనిపై ఎస్‌ఈసీ కూడా ఎలాంటి వివరణ ఇచ్చే ఛాన్స్ లేదు.

ఫస్ట్‌ ఫేజ్‌లో మొదలైన గొడవ లాస్ట్‌ ఫేజ్‌ వరకు నడువనుంది. పంచాయతీల్లో వైసీపీ 85 శాతం పైగా సీట్లు గెలిచిందని లెక్కలతో సహా చూపించమంటోంది వైసీపీ. తప్పుడు ప్రచారం చేయడం టీడీపీకి అలవాటే అంటున్నారు పార్టీ నేతలు. పంచాయతీల్లో బెదిరించి, భయపెట్టి వైసీపీ గెలిచిందంటున్నారు టీడీపీ నేతలు. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. మున్సిపల్ ఎన్నికల్లో అది మరింత బయటపడుతుందని చెబుతున్నారు. ఈ హీట్‌ మరింత పెంచేలా ఎస్‌ఈసీ మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ గుర్తులతోనే పోటీ పడండి అన్నట్టు ఈసారి మున్సిపల్‌ ఎన్నికలకు యుద్ధభేరీ మోగించారు. దీనిపై ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసిన పార్టీలు ప్రత్యర్థులను చిత్తు చేసే పనిలో ఉన్నారు.

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ… గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు గడువు విధించారు. రాష్ట్రంలోని 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జెండాలు లేకుండా జరిగిన ఎన్నికల్లో కత్తులు నూరుతున్న పార్టీలకు మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీకి ఆదరణ ఉందనేది ఈ ఎన్నికల్లో తేలనుంది.

Read also : గ్రెటా థన్‌బర్గ్‌ – దిశారవి చాటింగ్‌, ఖలిస్తాన్ సపోర్టర్స్ తోనూ లింకులు, టూల్‌కిట్‌కు షంతను, దిశ, నికిత అడ్మిన్‌లు.!