రాజస్థాన్ లో ‘ఆడియో టేపుల గోల’…కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2020 | 1:33 PM

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెబెల్ కాంగ్రెస్ నేతలు, ఇటు బీజేపీ కూడా తన వంతు 'కృషి' తాను చేస్తోంది. ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర పన్నారని చెబుతున్న ఓ ఆడియో క్లిప్ లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేరును..

రాజస్థాన్ లో ఆడియో టేపుల గోల...కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్
Follow us on

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెబెల్ కాంగ్రెస్ నేతలు, ఇటు బీజేపీ కూడా తన వంతు ‘కృషి’ తాను చేస్తోంది. ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర పన్నారని చెబుతున్న ఓ ఆడియో క్లిప్ లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేరును లాగేందుకు రణదీప్ సింగ్ సూర్జేవాలా, గోవింద్ సింగ్ దోత్సారా సహా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మీకాంత్ భరద్వాజ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయన జైపూర్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహేష్ జోషీ, సూర్జేవాలా మరి కొంతమంది రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభానికి తామే (బీజేపీ) కారణమని చూపేలా చేసేందుకు సాక్షాత్తూ సీఎం నివాసంలోనే ఫేక్ ఆడియో క్లిప్ లు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ప్రముఖ బీజేపీ నేతల గొంతులను  ఇమిటేట్ చేసి ఈ నకిలీ ఆడియో రికార్డింగులకు తెర తీశారన్నారు. లోకేష్ శర్మ అనే నాయకుడు ఈ నెల 16 న మూడు ఆడియో టేపులను మీడియాకు, వాట్సాప్ ద్వారా కూడా వీటిని సర్క్యులేట్ చేసినట్టు లక్ష్మీకాంత్ భరద్వాజ్ ఆరోపించారు. అయితే యధాప్రకారం ఆ ఆరోపణలను కాంగ్రెస్ నాయకత్వం ఖండించింది.