ఘోర ప్రమాదం..16 మంది బలి.. రీజన్ చూస్తే…!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ జిల్లాలో ఓ మినీ బస్సు, బోలెరో ఢీకోన్న ఘటనలో 16మంది మృతిచెందారు. మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాల్లో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో.. తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు.. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే అతివేగంతో ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:41 am, Sat, 28 September 19
ఘోర ప్రమాదం..16 మంది బలి.. రీజన్ చూస్తే...!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ జిల్లాలో ఓ మినీ బస్సు, బోలెరో ఢీకోన్న ఘటనలో 16మంది మృతిచెందారు. మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాల్లో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో.. తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు.. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే అతివేగంతో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. వాహనాలు రెండు నుజ్జునుజ్జు అయ్యాయి. రహదారి మొత్తం రక్తసిక్తమయ్యింది. జైసల్మీర్ – జోధ్‌పూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అతివేగం ఓ కారణం కాగా.. అదే సమయంలో బస్సు టైరు పేలడంతో.. ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.