RailYatri data for sale: రైల్‌యాత్రి యూజర్లకు షాకింగ్ న్యూస్.. డార్క్‌ వెబ్‌సైట్‌లో బేరానికి 3 కోట్ల రైల్వే ప్రయాణికుల డేటా..

|

Feb 21, 2023 | 8:12 PM

రైల్‌యాత్రి మొబైల్‌ యాప్‌ను సైబర్‌ నేరగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా హ్యాక్ చేశారు. రైల్‌యాత్రి యాప్‌ నుంచి దాదాపు 3.1 కోట్ల ప్రయాణికులకు సంబంధించిన డేటా పాయింట్ల సెట్‌ను..

RailYatri data for sale: రైల్‌యాత్రి యూజర్లకు షాకింగ్ న్యూస్.. డార్క్‌ వెబ్‌సైట్‌లో బేరానికి 3 కోట్ల రైల్వే ప్రయాణికుల డేటా..
Railyatri Data For Sale
Follow us on

రైల్‌యాత్రి మొబైల్‌ యాప్‌ను సైబర్‌ నేరగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా హ్యాక్ చేశారు. రైల్‌యాత్రి యాప్‌ నుంచి దాదాపు 3.1 కోట్ల ప్రయాణికులకు సంబంధించిన డేటా పాయింట్ల సెట్‌ను బ్రీచ్‌ ఫోరమ్‌లలో ఆదివారం (ఫిబ్రవరి 19) అమ్మకానికి ఉంచినట్లు హెచ్‌టీ గుర్తించింది. డేటా కొనుగోలు చేయాలంటే సంప్రదించవల్సిన లింక్‌లను సైతం సదరు వెబ్ ఫోరమ్‌ ప్రస్తావించింది. యూనిట్‌82 పేరుతో హ్యాకర్‌ ఈ డేటాను అమ్మకానికి పెట్టాడు. నిజానికి డిసెంబర్ 2022లోనే ఈ యాప్‌ను హ్యాక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇజ్రాయెల్‌లో గతేడాది ఆగస్టు 6 నుంచి యూనిట్82 బ్రీచ్డ్ ఫోరమ్‌లలో సభ్యత్వం కలిగి ఉన్నట్లు సైబర్ టీం గుర్తించింది. సైబర్ పోలీసు అధికారులు లీక్‌ను ట్రాక్ చేసేందుకు యత్నిస్తున్నారు.

యాప్‌ యూజర్ల డేటా ప్రమాదకర వ్యక్తుల చేతిలోకి చేరితే.. ముఖ్యంగా ఫోన్ నంబర్‌ల వంటి డేటా ద్వారా పెద్ద ఎత్తున దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుంది. ఆర్ధిక మోసాలు, నేరాలు లక్ష్యంగా ఈ నంబర్‌లను ఉపయోగించవచ్చు. ఇక పేర్లు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లతో సిమ్ కార్డుల కొనుగోలు, బ్యాంక్ ఆర్థిక లావాదేవీల వంటి పలు నేరాలలో ఉపయోగించేందుకు నకిలీ డాక్యుమెంట్లను సిద్ధం చేయడానికి ఉపయోగించవచ్చని ఓ సైబర్ పోలీసధికారి తెలిపారు.

రైల్‌యాత్రి అనేది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆధ్వర్యంలోని ఓ మొబైల్‌ యాప్. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం.. వంటి ఇతర రైల్వే సమాచారాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు రెండు లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం వీరి డేటా అంతా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.