
Railway Diwali: దేశ వ్యాప్తంగా అత్యంత సంబురంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం అనే తేడా లేకుండా దేశ ప్రజలంతా ఈ పండుగను జరుకుంటారు. దీంతో సహజంగానే ఈ పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో పండుగల వేళ ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతుంటాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేక రైళ్లతో పాటు రెగ్యులర్ రైళ్లకు అదనంగా కోచ్‌లను జతచేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పండుగకు ప్రయాణికుల ప్రయాణం సవ్యంగా సాగుతుందని అధికారులు తెలిపారు. ఇదే విషయమై ఢిల్లీకి చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్ డింపీ గార్గ్ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 79 ప్రత్యేక రైళ్లతో పాటు, 108 అదనపు కోచ్‌లను జత చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నాం. ఇది స్టేషన్‌కు పెద్ద ఎత్తున వచ్చే జనాలను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో క్లోన్ రైళ్లను (అసలు రైలు నెంబర్ తో నడిచే మరో రైలు)కూడా ఏర్పాటు చేసినట్లు డింపీ గార్గ్ తెలిపారు. సాధారణంగా ఒక రైలులో రిజర్వేషన్ పూర్తిగా నిండిపోయి, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉంటే.. వెయిటింగ్ లో ఉన్న ప్రయాణికులను మరో రైలులో తరలించడానికి ఈ క్లోన్ రైళ్లనుఏర్పాటు చేస్తారు. ఇక పండుగల సీజన్‌లలో టికెట్లు ఇప్పిస్తామంటూ ఫేక్ ఏజెంట్‌లు కూడా తమ చేతి వాటం చూపిస్తారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.
Goat Farming: ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో మేకల వ్యాపారం ప్రారంభించండి.. రూ.2లక్షలకు పైగా సంపాదించండి