కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇంగ్లాండ్‌లో వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం (ఫిబ్రవరి 28) బ్రిటన్ చేరుకున్నారు. అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు బుధవారం (మార్చి 1) ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సుప్రియ భరద్వాజ్ అనే ట్విటర్ యూజర్ రాహుల్ గాంధీతో సెల్ఫీ దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ చేరుకున్నారనే క్యాప్షన్‌తో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో రాహుల్ గాంధీ స్పెషల్ లుక్‌లో కనిపించడమే అందుకు కారణం. ట్రిమ్ షేవింగ్‌తో, హెయిర్ కటింగ్ చేయించుకుని, సూటు వేసుకుని, టై ధరించి మునుపెన్నడూ చూడని విధంగా ఉన్నారు.
యూకే పర్యటనకు ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో రాహుల్ గాంధీ గడ్డం పెంచారు. నెరసిన గడ్డం, తెల్ల టీ షర్టులో మొత్తం యాత్ర మొత్తం కొనసాగింది. ఆ తర్వాత కూడా దాదాపు ఆలాగే కనిపించారు. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారంటూ రాహుల్‌పై పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఐతే తాజా ఇంగ్లాండ్ పర్యటనలో రాహుల్ పూర్తిగా తన స్టైల్‌ను మార్చేశారు. విజిటింగ్ ఫెలోగా రాహుల్ యూకేలేని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘Learning to listen in the 21st century’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. వారంరోజుల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మార్చి 5న లండన్‌లోని భారతీయ ప్రవాసులతో సంభాషించనున్నారు. లండన్‌లోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) సభ్యులతో కూడా ఆయన సమావేశంకానున్నట్లు సమాచారం.
Mr @RahulGandhi reaches Cambridge pic.twitter.com/33h1lIckAu
— Supriya Bhardwaj (@Supriya23bh) March 1, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.